ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగ లేఖ రాశారు. ‘అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేదల అభ్యున్నతే లక్ష్యంగా కొట్లాడే వ్యక్తిని నేను. హైడ్రాసంస్థకు, హైదరాబాద్ ముంపు గురికాకుండా చూసేందుకు, మూసీ ప్రక్షాళనకు, మూసీను కొబ్బరినీళ్లలా చేసేందుకు, ఎకలాజికల్ బాలన్స్ కాపాడడానికి, విదేశీ పక్షులు రావడానికి, చేపలు పెంచడానికి, పిల్లలు ఈతకొట్టేల చెరువులు తయారు చేయడానికి నేను వ్యతిరేకం కాదు. చెరువు కన్నతల్లి లాంటిది. కానీ హైదరాబాద్ లో ఉన్న ఏ చెరువు…
సచివాలయంలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ (SRDS) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను మధురైలోని కమిషనరేట్ లో వాంజినాధన్ అనే లాయర్ కంప్లైంట్ ఇచ్చాడు. సనాతన ధర్మం పై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పవన్ వక్రీకరించారని ఫిర్యాదులో తెలిపారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతన…
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చట్టంలో మార్పులు చేర్పులు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.. ఈరోజు హైడ్రాకు సంబంధించి కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైడ్రాకు చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు.. కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అనంతరం ఆర్డినెన్సు పై సంతకం కోసం రాజ్ భవన్‌కి ఫైల్ పంపించిన ప్రభుత్వం.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్సు పై సంతకం చేశారు.
జి.వెంకటస్వామి (కాకా) 95వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా ఒకరు అని, గతంలో ఉన్నవారు కాకాను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూశారో.. లేక ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయాలనుకున్నారో తెలియదన్నారు. కాకా జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని నేను అధికారులను ఆదేశించా అని, ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదని కాకా…
పవర్లో ఉన్నా... చాలా విషయాల్లో పైచేయి అవలేకపోతున్నామని ఫీలవుతున్నారట తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పెద్దలు. ప్రజలకు మంచి చేస్తున్నా... అది వెళ్ళాల్సినంత ఎక్కువగా వెళ్ళడం లేదన్న చర్చ పార్టీలో గట్టిగానే జరుగుతోందంటున్నారు. ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్న... విచ్చలవిడిగా పని చేసిన పార్టీ శ్రేణులు అధికారంలోకి వచ్చాక కాస్త సైలెంట్‌గా ఉంటున్నాయన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉందట. చివరికి ప్రతిపక్షాల విమర్శల్ని సైతం దీటుగా తిప్పికొట్టలేకపోతున్నామన్న అభిప్రాయం గాంధీభవన్ పెద్దల్లో ఉందంటున్నారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మీపై, మన పార్టీపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడానికి ప్రతిపక్షాలు నన్ను, నా కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న ఫాం హౌస్ ను పావుగా వాడుకోవడం.. నాకు తీవ్ర మనోవేదన కలిగిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. మా ఫాం హౌస్ లో ఏ కట్టడమూ ఎఫ్టీఎల్,బఫర్ జోన్ పరిధిలో లేవు.. ఏ కట్టడమైనా ఒక్క అంగుళం మేరకు ఉన్నా.. నా సొంత ఖర్చులతో కూల్చడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు.
KTR Tweet: 20 లక్షల మందికి రుణమాఫీ అందలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడంతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
దక్షిణ తైవాన్ను హడలెత్తించిన క్రాథాన్ తుఫాన్.. ఇద్దరు మృతి దక్షిణ తైవాన్ను టైఫూన్ క్రాథాన్ బెంబేలెత్తించింది. అత్యంత శక్తివంతంగా తుఫాన్ దూసుకొచ్చింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో వస్తువులు గాల్లోకి ఎగిరిపోయాయి. భారీ ఎత్తున ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు. ఇక భారీ వర్షం కారణంగా ప్రధాన ఓడరేవు నగరం కాహ్‌సియంగ్‌ను ముంచెత్తింది. దీంతో ద్వీపాన్ని రెండో రోజు కూడా మూసివేశారు.…
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఎమ్మెస్సీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత సీజన్ లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని, ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ…