CM Revanth: తెలంగాణను దక్షిణ ఆసియా టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చుదిద్దుతాం..
- ATEXCON 2026లో తెలంగాణ టెక్స్‌టైల్ విజన్
- Asian Textiles Conference 2026 హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం
- 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాలో టెక్స్‌టైల్ రాజధానిగా మార్చే లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth: హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఘనంగా ప్రారంభమైన 13వ ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్ 2026 (ATEXCON) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టెక్స్‌టైల్ రంగ ప్రముఖులకు స్వాగతం పలుకుతూ, తెలంగాణను ప్రపంచ వస్త్ర రంగ పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వ దార్శనికతను పంచుకున్నారు.
ఈ కార్యాక్రమంలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు వస్త్ర రంగంతో ఉన్న చారిత్రక అనుబంధాన్ని గుర్తుచేశారు. భారతదేశానికి అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర ఉంది. తెలంగాణ గర్వంగా చెబుతోంది.. టెక్స్‌టైల్ మన DNAలోనే ఉంది. నిజాం కాలంలోనే ప్రపంచ నలుమూలల నుండి వ్యాపారులు హైదరాబాద్ కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారు అని ఆయన పేర్కొన్నారు. కేవలం పరిశ్రమగానే కాకుండా, ఇది లక్షలాది మందికి జీవనాధారమని.. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీస్ వంటివి మన సంస్కృతికి ప్రతీకలని తెలిపారు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
TVK Chief Vijay: చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్.. నామినేషన్ రద్దయ్యే ఛాన్స్?
‘తెలంగాణ రైజింగ్ 2047’ గురించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను వివరిస్తూ, “తెలంగాణ రైజింగ్ 2047” విజన్‌ను సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యం అని పేర్కొన్నారు. ఇంకా 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాలోనే టెక్స్‌టైల్ రాజధానిగా మార్చడమే మా సంకల్పం అని అన్నారు. అలాగే వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ద్వారా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం పత్తి నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, పత్తి ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని సీఎం అన్నారు. ఈ సందర్బంగా పెట్టుబడిదారులకు ఆయన పిలుపునిస్తూ.. “మీకు విజన్ ఉంటే, మేము మీకు సరైన భాగస్వాములం. మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, నీరు, వేగవంతమైన అనుమతులతో పాటు ప్రపంచ స్థాయి విధానాలను మా ప్రభుత్వం అందిస్తుంది” అంటూ హామీ ఇచ్చారు. డీప్ టెక్, ఫార్మా, ఏరోస్పేస్ వంటి రంగాల్లో ఇప్పటికే ముందంజలో ఉన్న తెలంగాణ, ఇప్పుడు టెక్స్‌టైల్ ఎకోసిస్టమ్ ను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
మరోవైపు హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ సినిమా నిర్మాణ కేంద్రంగా ఎదుగుతోందని, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు ఇక్కడ స్టూడియోలను ప్రారంభించడాన్ని ఆయన ప్రస్తావించారు. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాక హాలీవుడ్ కూడా హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకుంటున్న తరుణంలో సినిమా రంగానికి అవసరమైన ఫ్యాషన్ ను కూడా తెలంగాణ నుంచే అందించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ‘గ్రీన్ టెక్స్‌టైల్ హబ్’ లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!
యువతకు, ముఖ్యంగా మహిళలకు ఆధునిక డిజైనింగ్, కట్టింగ్, స్టిచింగ్ లో శిక్షణ అందించి వారి నైపుణ్యాన్ని పెంచుతామని సీఎం అన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు, ఔషధాలు అందించిన రాష్ట్రం మనది. ఆపిల్ ఇయర్ పాడ్స్ కూడా ఇక్కడే తయారవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి దేశంలో తెలంగాణలో తయారైన దుస్తులు ధరించేలా చేయడమే మా లక్ష్యం అని ఆయన అన్నారు. తెలంగాణ పత్తి పొలాల నుండి లండన్, పారిస్, మిలాన్ ఫ్యాషన్ షోల వరకు మన వస్త్రాలు వెళ్లాలని, ఈ ప్రయాణంలో పెట్టుబడిదారులందరూ భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!