CM Revanth: మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్.. ప్రాక్టీస్ తో చెమటోడుస్తున్న సీఎం సాబ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాజకీయాలలో తిరుగులోని డెసిసిన్స్ తో ప్రతిపక్షాలను ఆడుకుంటున్న నేపధ్యంలో.. ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) తో నిజమైన ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీని ఢీకొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. భారత పర్యటనలో భాగంగా అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ ఈ నెల డిసెంబర్ 13న హైదరాబాద్ నగరానికి విచ్చేయనున్నారు. అదే రోజున మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తరువాత డిసెంబర్ 13న సాయంత్రం ఉప్పల్ మైదానంలో లియోనెల్ మెస్సీ టీమ్‌తో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ అంతర్జాతీయ దిగ్గజ ఆటగాడితో తలపడటానికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు.
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీ (MCHRD) గ్రౌండ్స్‌లో ఆటగాళ్లతో కలిసి తీవ్రంగా సాధన చేస్తున్నారు. సీఎంవో (CMO) కార్యాలయం ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్ గురించి సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ.. “క్రీడా స్ఫూర్తి.. తెలంగాణ కీర్తి. ఈ నెల 13న ప్రపంచ ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీతో ఆడేందుకు ప్రాక్టీస్ ప్రారంభించాను. ‘తెలంగాణ రైజింగ్ – 2047’ విజన్‌ను క్రీడా వేదిక నుంచి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచనతో క్రీడా మైదానంలోకి స్వయంగా దిగానని పేర్కొన్నారు. మెస్సీని హైదరాబాద్‌కు ఆహ్వానించడానికి, భేటీ అవ్వడానికి ఎదురుచూస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.
IT Raids On Restaurants: ప్రముఖ హోటళ్లపై ఐటీ పంజా.. ఆర్థిక లావాదేవీలపై ఆరా..!
క్రీడా స్ఫూర్తి…
తెలంగాణ కీర్తి…
ఈ నెల 13 న ప్రపంచ ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీ తో ఫుట్ బాల్ క్రీడలో పాల్గొనేందుకు ప్రాక్టీస్ ప్రారంభించాను. “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ ను క్రీడా వేదిక నుండి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచన… pic.twitter.com/kWL43FtOMB— Revanth Reddy (@revanth_anumula) December 1, 2025
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!