CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth: వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆరోగ్య, హోం, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈ ఏడాది వర్షపాతం పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు.
సమీక్ష సందర్భంగా రైతులకు వర్షాభావ పరిస్థితులపై ముందస్తు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలపై రైతులకు స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు. అలాగే పంటల మార్పిడి, పంటల వైవిధ్యీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను అన్నదాతలకు వివరించాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతుల పనులపై కూడా సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రాజెక్టుల గేట్లు, ఇతర నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు.
Also Read
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
విపత్తు నిర్వహణ శాఖ వద్ద అందుబాటులో ఉన్న రూ.1000 కోట్ల నిధులను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా వినియోగించాలని సీఎం స్పష్టం చేశారు. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పశువుల నష్టం వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తం తెలంగాణ రైతుల అవసరాల కోసం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!