Madhya Pradesh: ప్రస్తుత కాలంలో సాధారణ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి అంటేనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వివాహాలు చేస్తున్నారు. కానీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుమారుడు మాత్రం ఈ విషయంలో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Sonam Raghuvanshi Case: రాజా రఘువంశీ హత్య, భార్య సోనమ్ రఘువంశీ దుర్మార్గం యావత్ దేశంలో సంచలనంగా మారింది. కొత్తగా పెళ్లయని జంట హనీమూన్‌కి వెళ్లింది. అక్కడే కిరాయి హంతకులతో సోనమ్ రాజాను దారుణంగా హత్య చేయించింది. పెళ్లయిన రెండు వారాల వ్యవధిలోనే భర్తను ప్రియుడు రాజ్ కుష్వాహా కోసం కడతేర్చింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సోమవారం మత మార్పిడుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడుల కేసుల్లో మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వ దీనిపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కలిగి ఉందని అన్నారు. మైనర్లపై అత్యాచారానికి శిక్ష విధించినట్లే, బాలికల్ని మతం మార్చిన వారికి కూడా మరణశిక్ష విధించే నిబంధనల్ని తమ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఆయన చెప్పారు. Read Also: Pakistan: కుల్‌భూషన్ జాదవ్ కిడ్నాప్‌కి సాయం చేసిన ఉగ్రవాది హతం..…
దేశానికి వెన్నెముక అయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నాయి. నీటి సౌకర్యాలను కల్పిస్తూ.. ఆర్థిక సాయం అందించే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రైతులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రైతులకు రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రకటించారు. సీఎం హౌస్‌లోని సమత్వ భవన్‌లో కిసాన్ ఆభార్ సమ్మేళన్ జరిగింది. ఈ సందర్భంగా సీఎం ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసి వెంటనే…
భోపాల్‌లో మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో కలిసి సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడారు.. ప్రధాని మోడీ సమక్షంలో మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని మోహన్ యాదవ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మతపరమైన పట్టణాల్లో మద్య నిషేధాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఓర్చా, చిత్రకూట్, ఇతర మతపరమైన నగరాల పరిమితుల్లో మద్యం అమ్మకాలు నిషేధించనుంది. కొత్త ఎక్సైజ్ పాలసీలో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ కలెక్టర్ తీరు వివాదాస్పదమైంది. ట్రకర్ల నిరసన నేపథ్యంలో షాజాపూర్ జిల్లా కలెక్టర్ కిషోర్ కన్యన్ చేసిన ‘ఔకత్’ (స్థాయి) వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారాన్ని రేపాయి. ట్రక్కర్ల ప్రతినిధిని ఉద్దేశిస్తూ ‘నీ స్థాయి ఎంత’ అని ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం మోహన్ యాదవ్ సీరియస్ అయ్యారు. కలెక్టర్‌ని పదవి నుంచి తొలగించింది బీజేపీ ప్రభుత్వం. ఇలాంటి వ్యాఖ్యల్ని సహించేది లేదని సీఎం మోహన్ యాదవ్ అన్నారు.
డాక్టర్ మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మధ్యప్రదేశ్‌లో పరిపాలన చాలా చురుగ్గా కనిపిస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో ఓ కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. యూపీ సీఎం ఫార్ములాను ఉపయోగిస్తుంది. నర్మదాపురంలోని బిటిఐ ప్రాంతంలో రెండు రోజుల క్రితం సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితులలోని…