భోపాల్‌లో మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో కలిసి సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడారు.. ప్రధాని మోడీ సమక్షంలో మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో అభివృద్ధి, పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రధాని మోడీ సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ మరియు సబ్‌కా ప్రయాస్ అనే మంత్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ ప్రజలు 2047 నాటికి ‘విక్షిత్ భారత్’ను రూపొందించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోడీ సంకల్పాన్ని నెరవేర్చడంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రధాన పాత్ర పోషించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Dubba Rajanna Swamy: నేటి నుండి దుబ్బ రాజన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మంత్రి ధర్మేంద్ర భావ్ సింగ్ లోధి మాట్లాడుతూ.. మోహన్ యాదవ్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పర్యాటక రంగానికి భారీ ప్రోత్సాహాన్నిచ్చే పర్యాటక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు.
#WATCH | Bhopal: Madhya Pradesh CM Mohan Yadav felicitates PM Modi as he arrives to inaugurate the "Invest MP Global Investor Summit" (GIS) 2025.
(Source: ANI/DD) pic.twitter.com/n4RS1YydeA
— ANI (@ANI) February 24, 2025
#WATCH | Bhopal | Madhya Pradesh Global Investors' Summit | CM Mohan Yadav says, "…It is our good fortune that in the presence of PM Modi, the Madhya Pradesh Global Investors' Summit is being organised…There are huge opportunities for development and investment in Madhya… pic.twitter.com/wUwhHrJiHi
— ANI (@ANI) February 24, 2025