వృద్ద కళాకారులకు కెసిఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. వృద్ధ కళాకారుల నెలవారీ పింఛన్ మొత్తాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నెల వారీ పెన్షన్‌ను రూ.1500 నుంచి రూ.3,016కు పెంచుతూ జీవో జారీ చేసింది. జూన్- 2021 నుంచి దీన్ని వర్తింపజేయనుంది ప్రభుత్వం. వృద్ధ కళాకారులకు పింఛన్ పెంపును అమలు చేసిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో…
మే 12 వ తేదీ నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఈ లాక్‌డౌన్ మే 30 వ తేదీతో ముగియనున్నది. అయితే, లాక్ డౌన్ కొనసాగింపు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రజల అభిప్రాయం తీసుకోవాలని, ప్రజల అభిప్రాయం మేరకు లాక్‌డౌన్ కొనసాగింపు లేదా సడలింపు సమయం పెంపు తదితర అంశాలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈనెల 30…
సీఎం కేసీఆర్ పై బిజేపి నేత విజయశాంతి మరోసారి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ లో అణువణువునా అహంకారం ఉందని మండిపడ్డారు. “తెలంగాణ సీఎం కేసీఆర్ గారిలో అణువణువునా నిండిన అహంకారం ఫలితం ఏమిటో నేటి మీడియా కథనం చూస్తే అర్థమవుతుంది. విపక్షాలు ఎంతగా చెప్పినా… ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా వినకుండా పట్టుదలకు పోయి ఈ సర్కారు నిర్వహించిన పలు ఎన్నికల వల్ల పలువురు ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది కరోనా బారిన పడి…
సమ్మె చేస్తున్న డాక్టర్లతో తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు & పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. డాక్టర్లకు కెసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. నోటితో మాట్లాడి …నొసటితో వెక్కిరించి నట్లు సిఎం కెసిఆర్ హామీలు ఉన్నాయని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మీ అధికారుల్లో చిత్త శుద్ధి లేదు.. చెత్త శుద్ధి ఉందని మండిపడ్డారు. డాక్టర్లు చేస్తున్న న్యాయ బద్ద సమ్మెను పరిష్కరించాలని..…
తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు జూనియర్ డాక్టర్లు.. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని.. రేపటి నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే, జూడాలతో ప్రభుత్వం తరపున చర్చలు జరిపారు తెలంగాణ డీఎంఈ రమేష్ రెడ్డి… ఈ చర్చలు విఫలం అయినట్టుగా తెలుస్తోంది.. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదని చెబుతున్నారు జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు.. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే విధుల్లోకి చేరతామని చెప్పామని.. కానీ, ప్రభుత్వం…
జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అసలు, జూడాల సమ్మెకు కారణం ముఖ్యమంత్రియే నని.. కరోనభారిన పడే వైద్య సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఎక్కడ వైద్యం చేసుకుంటారు అంటే అక్కడ చేయించాలన్నారు.. జూడాలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు బండి సంజయ్.. జూనియర్ డాక్టర్ లు ఈ సమయం లో సమ్మె చేయడం సరికాదు.. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు……
తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు రేపటి నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించనున్నట్టు ప్రకటించారు.. ఈ నేపథ్యంలో జూడాల సమ్మెపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధికారులతో ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించిన సీఎం.. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు. ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల పట్ల ఏనాడూ వివక్ష చూపలేదని..…
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి తీసుకోవాలన్నారు. ఇటీవల నెల్లికల్లులో శంఖుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి , కాల్వల నిర్మాణం, పంపుల…
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి ఈటల కబ్జా పెట్టారనే ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి. అయితే ఈ కేసులో ఇప్పటికే సిఎం కెసిఆర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిఎం కెసిఆర్ పై బహిరంగంగానే ఈటల కామెంట్స్ చేశారు. అంతేకాదు అన్ని పార్టీల నేతలను ఈటల…