తెలంగాణలో వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు సీఎం కేసీఆర్.. దీనిలో భాగంగా.. సర్వే కంపెనీలతో చర్చలు కూడా జరిపారు సీఎస్ సోమేష్‌కుమార్.. ఇవాళ సీఎం కేసీఆర్ వారితో సమావేశమయ్యారు. డిజిటల్ సర్వేపై కీలక ఆదేశాలు జారీ చేశారు.. సర్వేలో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని, అందులో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలని, మిగతా…
తెలంగాణ రాష్ట్రం ఇవాళ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటుంది.. కరోనా సమయంలో.. ఎలాంటి హడావుడి లేకుండా కార్యక్రమాలు నిర్వహించారు.. ఉదయం అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి.. గవర్నర్ తమిళిసైని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. ఇవాళ గవర్నర్ పుట్టిన రోజు కూడా కావడంతో ఆమెకు బొకేను అందించిన విషెష్ చెప్పారు.. ఆమె ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. తాజా పరిస్థితులపై…
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుటుందో తెలంగాణ.. ఈ సమయంలో.. తమ వల్లే రాష్ట్రం సాధ్యమైందనే.. తాము లేకపోతే రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదని ఎవ్వరికి వారు చెప్పుకుంటున్నారు.. తాజాగా తెలంగాణ ఉద్యమంపై స్పందించిన బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. తెలంగాణ రాష్ట్ర ఆలోచన మొదట బీజేపీదే అన్నారు.. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పింది బీజేపీయేనని ఆమె గుర్తుచేశారు.. ఇక, తెలంగాణ ఉద్యమంలోకి టీఆర్ఎస్ లేట్‌గా వచ్చిందని కామెంట్ చేశారు.. కేసీఆర్ ఉద్యమ సమయంలో…
తెలంగాణలో హరిత విప్లవానికి సీఎం కేసీఆర్ తెరలేపారు అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి కేటీఆర్.. ఇవాళ సిరిసిల్లలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయానికి దేశంలో ఏ రాష్ట్రం, ఏ నాయకుడు ఇవ్వని ప్రాధాన్యత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని తెలిపారు.. టిఆర్ఎస్ ప్రభుత్వం కర్షక ప్రభుత్వమని ప్రకటించిన ఆయన.. ఎండాకాలంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మత్తల్లు దుకించినా ఘనత కేసీఆర్‌దే అన్నారు.. రైతాంగానికి రైతు బీమ, రైతు బంధు పథకాల ద్వారా ప్రోత్సాహం టిఆర్ఎస్…
కేసీఆర్ సంకల్పంతో దేశంలోనే మన రాష్ట్రము అగ్రగామి వుంది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు తో రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నాము. దేశంలోనే హాస్పిటల్స్ కు వెళ్లి కరోనా పేషంట్లతో మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. దేశంలోనే నిరంతరం విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా వరి కొనుగోలు చేశాము. రైతులకు గిట్టుబాటు ధర…
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. ఏడేళ్ల పాలన తెలంగాణ ప్రజల ఆత్మ ఘోష కు ఉపయోగపడే పాలన అని ధ్వజ మెత్తారు. ప్రజాస్వామ్య విలువలను ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో నారాయణ మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అయిందన్నారు. రాష్ట్రం ఆరంభంలోనే ఇది భౌగోళికంగా తెలంగాణ…
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీ ఇబ్బంది పడుతుందని తెలిసి కూడా ఇచ్చిన మాట కోసం సోనియగాంధీ తెలంగాణ ఇచ్చారు అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టారు కేసీఆర్. తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి పరిమితం అయ్యింది. రాష్ట్రంలో వర్షాలు పడ్డాయి .. తెలంగాణలో సాగు పెరిగింది. కేసీఆర్ కొత్తగా నీళ్ళు ఇచ్చి… సాగు లోకి వచ్చింది లేదు. నాలుగు లక్షల కోట్ల అప్పులు…
తెలంగాణలో కొత్త పార్టీతో వస్తున్నానని వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. సిఎం కెసిఆరే టార్గెట్ గా షర్మిల పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో నేరుగా సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తాజాగా రేపు మెదక్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర చేయనున్నారు. ఉదయం 6 గంటలకు లోటస్ పాండ్ నుంచి బయలుదేరనున్న షర్మిల..మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఎల్దుర్తి మండలంలోని అమరవీరుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఉద్యోగం రావట్లేదని…
తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ అవతరణ దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాల తో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామన్నారు. ఏడేండ్ల అనతి కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమ నినాదాలను వొక్కొక్కటిగా అమలు చేస్తున్నదన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం,…