మే 12 వ తేదీ నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఈ లాక్‌డౌన్ మే 30 వ తేదీతో ముగియనున్నది. అయితే, లాక్ డౌన్ కొనసాగింపు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రజల అభిప్రాయం తీసుకోవాలని, ప్రజల అభిప్రాయం మేరకు లాక్‌డౌన్ కొనసాగింపు లేదా సడలింపు సమయం పెంపు తదితర అంశాలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈనెల 30 వ తేదీన మంత్రి మండలి సమావేశం కాబోతున్నది. ఈ సమావేశంలో మంత్రులు సేకరించిన ప్రజాభిప్రాయంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.