సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనపై నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ సమయం చూసుకొని.. సీఎం కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. “కరోనా రోగులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ గారు వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తే… అక్కడి ప్రజలు మాత్రం జనవరి 2015 నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళారు. నాడు ఈ నగరంలోని పలు మురికివాడల్లో పర్యటించిన సీఎం గారు వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, వాటిలో దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని…
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు. మరికొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనున్న నేపథ్యంలో రైతుల వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న పరిస్థితుల్లో.. ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని మరో వారం పది రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం…
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన.. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.. ఆయా జిల్లాల్లో పరిస్థితి ఏంటి అనేదానిపై ఆరా తీశారు.. ఇక, తన పర్యటనలో ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీఎం.. కోవిడ్ రోగులతో మాట్లాడి.. వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు.. వారిలో భరోసా నింపుతూ ధైర్యాన్ని చెప్పారు..…
ఇవాళ సీఎం కేసీఆర్ వరంగల్ లో పర్యటించారు. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ సీఎంకు స్వాగతం పలుకగా అనంతరం కేసీఆర్ నేరుగా ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడ ఉన్న కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోకి కోవిడ్ వార్డులలో పర్యటించి రోగులకు భరోసా…
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసా గుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు కరోనాతో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా కరోనాతో ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్ లాల్ బహుగుణ ఇవాళ మృతి చెందారు. కొన్ని…
వరంగల్ పర్యటనలో భాగంగా ఇవాళ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న సిఎం కెసిఆర్ నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అని ఆయన అన్నారు. ప్రతీ బెడ్…
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గా భువనగిరి ఏరియా హాస్పిటల్,బిబినగర్ ఎయిమ్స్ 25 ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నాము అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భారతదేశం ఈరోజు ఈ స్థితిలో ఉందంటే ఆరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చేపట్టిన సంస్కరణలు కారణం అని అన్నారు. పక్క రాష్ట్రాలలో కరోనాను ఉచిత వైద్యం అందిస్తుంటే తెలంగాణలో మాత్రం అలా చేయకుండా తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కరోనా ను ఆరోగ్యశ్రీ ఈరోజు…
సిఎం కెసిఆర్ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్, ఫార్మ్ హౌస్ దాటి సీఎం కేసీఆర్ బయటకు రావాలని బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుందన్నారు. ప్రజల విజ్ఞప్తులను కూడా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకే టైం ఇవ్వని సీఎం..ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత బయటక వచ్చారని ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారు…సీఎం కేసీఆర్ గాంధీకి వెళ్లడం పట్ల చాలా సంతోషిస్తున్నామన్నారు.…
ఈటలకు మరో షాక్ తగిలింది. జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు, ఎంపీపీ దొడ్డే మమతతో పాటు 12 మంది కౌన్సిలర్లు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సింగిల్విండో చైర్మన్ లు నాయకులు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కెసిఆర్, కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తామని ప్రకటించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించడంతో తెలంగాణను సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో…