సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లతో చర్చలు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో పాటు, మంత్రి కేటీఆర్ వెంటనే విధుల్లో చేరాలని జూడాలను కోరారు.. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో.. సమ్మెలు కరెక్ట్ కాదని హితవు పలికారు.. మరోవైపు.. రేపటి నుంచి అత్యవసర విధులను కూడా బహిష్కరించాలని నిర్ణయించారు జూనియర్ డాక్టర్లు.. ఈ సమయంలో.. వారితో చర్చలు ప్రారంభించారు డీఎంఈ రమేష్ రెడ్డి.. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కావును వెంటనే సమ్మె విరమించాలని కోరినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు.. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన డీఎంఈ రమేష్ రెడ్డి.. పోస్ట్ కోవిడ్ ఔట్ పేషేంట్ల కోసం ప్రత్యేక విభాగం అన్ని ఆస్పత్రుల్లో ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు ప్రైవేట్ లో ఉన్న ఫంగస్ కేసులను టెన్షన్ పెడుతున్నారన్న ఆయన.. అంపోటేరిసీన్ బి తయారీ చాలా తక్కువ ఉందన్నారు.. అందుకే ప్రత్యామ్నాయ మందులు వాడాలని.. అంపోటెరిసిన్ స్టాక్ లేదు.. చిట్టి రాసి ఇచ్చి తిప్పొద్దని సూచించారు.. ఇక, కోవిడ్ డ్యూటీల్లో ఉన్న సీనియర్ రెసిడెంట్ లకు 15 శాతం ఇంటెన్సీవ్ ఇవ్వడానికి సీఎం ఒప్పుకున్నారన్న రమేష్ రెడ్డి.. జూడాల సమస్యల పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. జూడాలు విధుల్లో చేరాలని సీఎం కోరినట్టు వెల్లడించారు.