వృద్ద కళాకారులకు కెసిఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. వృద్ధ కళాకారుల నెలవారీ పింఛన్ మొత్తాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నెల వారీ పెన్షన్‌ను రూ.1500 నుంచి రూ.3,016కు పెంచుతూ జీవో జారీ చేసింది. జూన్- 2021 నుంచి దీన్ని వర్తింపజేయనుంది ప్రభుత్వం. వృద్ధ కళాకారులకు పింఛన్ పెంపును అమలు చేసిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 2,661 మంది కళాకారులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.