టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఘాటు లేఖ విడుదల చేశారు మావోయిస్టులు.. తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదలైంది.. ఈటల.. అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను ఖండించిన తెలంగాణ మావోయిస్టు పార్టీ… తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తూ కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని అందుకోసం ఆర్ఎస్ఎస్ నుండి పోరాడాలని…
తెలంగాణ సర్కార్ పై వి. హనుమంత రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్ లో స్మశానాలకు కూడా స్థలం దొరకదని.. భవిష్యత్ తరాలకు ఇబ్బంది అవుతుందన్నారు. గత ప్రభుత్వాలు భూములన్ని అమ్మితే ఈ రోజు భూములు ఉండేవా అని ప్రశ్నించారు. అన్ని పార్టీ లు కలిసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. 2019 ఏప్రిల్ 12న జై భీం కార్యకర్తలు పంజాగుట్టలో అంబెడ్కర్ విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేశారని..మున్సిపల్ అధికారులు…
ఈనెల 21న వరంగల్ జిల్లాకు సిఎం కేసిఆర్ రానున్నారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. నూతనంగా నిర్మిస్తున్న వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 24 అంతస్థుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు 57 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో నూతన కలెక్టరేట్‌ల సముదాయాల నిర్మాణం అవుతోందన్నారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సెటైర్లు వేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. సీఎం కేసీఆర్ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల్ని తానే స్వయంగా చెకింగ్ చేస్తానని, చెప్పకుండా… చెయ్యకుండా వచ్చి పరిశీలిస్తానని అన్నారు. ఆఫీసర్లు అందుబాటులో ఉండి తానడిగిన రిపోర్టులివ్వాలని… తేడా వస్తే స్పాట్‌లోనే సస్పెన్షన్లు ఉంటాయని సీరియస్‌గా హెచ్చరించారని గుర్తుచేసిన ఆమె.. సీఎం మాటలకు భయపడాల్సిన పనిలేదని అధికారులకు బాగా తెలుసు అని ఎద్దేవా చేశారు.. ఎందుకంటే,…
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పై జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల(డీ పీ వో )తో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా లాంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యరంగంలో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని ఈ సందర్బంగా సీఎం కెసిఆర్ తెలిపారు. ఇటీవలె 7 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగిందని, వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో అద్భుతమైన మల్టీ సూపర్ స్పెషాలిటి హాస్పటల్…
అందరి భాగస్వామ్యం అవసరమనీ, ఆ క్రమంలో తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పల్లెలు పట్టణాలను ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లు , జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కంకణబద్దులు కావాలని, గ్రామాలు పట్ణణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు…
భూములు అమ్మాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. సమైక్య రాష్ట్రంలో భూముల కోల్పోయాం అనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో దోపిడీ జరిగింది.. నేను కూడా అలాగే చేస్తా అంటే ఎలా ? అని ప్రశ్నించారు. జనం నిన్ను కూడా అలాగే సాగనంపుతారని కెసిఆర్ ను హెచ్చరించారు. అప్పులు ఓ వైపు..భూముల అమ్మకం ఇంకో వైపు రాష్ట్రాన్ని దివాలా తియించడమే అని.. భూముల అమ్మకాన్ని నిలిపి వేయాలని భట్టి…
గజ్వేల్ లో సిఎం కేసిఆర్ కాలు పెట్టడం చాలా అదృష్టమని మంత్రి హరీష్ రావు అన్నారు. 7 కోట్ల 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యంతో గజ్వేల్ దశ, దిశ మారిందని..గజ్వేల్ ప్రజలు కలలో కూడా ఊహించనంత అభివృద్ధి జరిగిందన్నారు. కసికడు నీళ్ల కోసం ఇబ్బంది పడ్డ గజ్వేల్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తెచ్చి…
ఈటల ఎపిసోడ్ తో టీఆర్ఎస్ లో పెద్ద అలజడి మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈటల టీఆర్ఎస్ ను వీడటంతో.. ఆయన స్థానాన్ని మరో బీసీ నాయకుడితో భర్తీ చేయాలని గులాబీ బాస్ స్కెచ్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నేతలపై గురిపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణను కూడా ఇటీవలే పార్టీలోకి ఆహ్వానించారు టీఆర్ఎస్ నేతలు. అంతే కాదు టిఆర్ఎస్ పార్టీలోకి రమణ వెళుతున్నట్లు మీడియాలో వార్తలు…