యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, 20 లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయే విధంగా అన్ని సౌకర్యాలు ఉండేలా ఆలయ నిర్మాణ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు అధికారులను ఆదేశించారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో పనులను వేగంగా పూర్తి చేయాలని అన్ని రకాల పనులను సమాంతరంగా కొనసాగించాలని సూచించారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి యాదాద్రిని సందర్శించారు. తొలుత ఆలయ రింగ్ రోడ్ చుట్టూ పర్యటించి…
తెలంగాణలో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించారు.. ప్రస్తుతం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ అంటూ.. ఒకే పేరుతో రెండు జిల్లాలు ఉన్నాయి.. అయితే, వరంగల్ అర్బన్‌ను హన్మకొండ జిల్లాగా.. వరంగల్ రూరల్‌ను వరంగల్ జిల్లాగా మార్చనున్నట్టు వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో వెలువడతాయని తెలిపారు.. వరంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. ఇవాళ వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన…
సీఎం కేసీఆర్ పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. బీజేపీని తిట్టడానికి అధికార వేదికలు వాడుకోవద్దని సూచనలు చేసిన రఘనందన్… కేసీఆర్ భాషను నియంత్రించుకోవాలని సూచించారు. యాక్షన్ కు రియాక్షన్ కూడా వస్తోందని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడటం తెలంగాణ సమాజానికి సిగ్గుచేటు అని.. దుబ్బాక భయంతోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలకు బయలు దేరాడని ఎద్దేవా చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేను దుబ్బాక ఎమ్మెల్యే కూడా…
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ వంశస్థులు… అవినీతిపరులు ఓడిపోతారని వ్యాఖ్యానించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కమలం, కేసీఆర్ అహంకారంని అణిచి వేస్తుందన్న ఆయన.. తెలంగాణ ప్రజలు, కేసీఆర్ ఆహంకారానికి మధ్య జరుగుతున్న పోరు ఇదిగా అభివర్ణించారు.. కేసీఆర్ రైతులను.. యువకులను మోసం చేశారని ఆరోపించిన తరుణ్ చుగ్.. కేసీఆర్ అహంకారం దిగుతుంది.. ఈటల రాజేందర్ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు.. తెలంగాణలో వారసత్వ రాజకీయాలను అంతం…
తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ చరిత్ర లో చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని, ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం లో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని సీఎం అన్నారు. ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ,…
బీజేపీ నేత విజయశాంతి మరోసారి సిఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ఎలా ఎత్తేస్తారని ఆమె ప్రశ్నించారు. ” తెలంగాణ ప్రజలంటే శుద్ధ అమాయకులని, ఇట్టే మోసం చెయ్యవచ్చనేది సీఎం కేసీఆర్ గారి గట్టి విశ్వాసం. నిన్నటి వరకూ కరోనా పేరిట పగలు కొన్ని గంటల పాటు, రాత్రి మొత్తం లాక్‌డౌన్ పెట్టి… చివరికి పాజిటివ్ రేటు తగ్గిపోయిందంటూ కరోనా కట్టడికి ఎలాంటి చర్యలూ ప్రకటించకుండానే ఉన్నట్టుండి లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేశారు.…
తెలంగాణ సిఎం కెసిఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేను బయలు దేరిన నాడు తెలంగాణ వస్తుందని ఎవరు నమ్మలేదని.. 100 శాతం బంగారు తెలంగాణ అయి తీరుతుందని స్పష్టం చేశారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ప్రాజెక్ట్ పేరు దేవుడు పేరు పెట్టామని తెలిపారు. సిద్దిపేట తన పుట్టిన జిల్లా అని.. సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు సీఎం…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సిద్దిపేట, కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం సిద్దిపేటకు వెళ్లిన ముఖ్యమంత్రి కలెక్టరేట్, సీపీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ప్రసంగించారు. సిద్దిపేట తాను పుట్టిన జిల్లా అని తెలిపారు. సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీని మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సిద్దిపేటతో పాటుగా వరంగల్, నల్గొండ, నిజామాబాద్ లకు వెటర్నరీ కాలేజీలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో మంచినీళ్లకు ఇబ్బందులు పడ్డామని, ప్రస్తుతం చెరువులన్నీ నిండి ఉన్నాయని, మే నెలలో కూడా…
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం.. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్, తదితర అంశాలపై చర్చించిన కేబినెట్.. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయానికి వచ్చింది.. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చినట్టు కేబినెట్ పేర్కొంది.. అన్ని రకాల నిబంధనలు పూర్తిగా ఎత్తివేసింది.. కరోనా కేసులు, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని.. వైద్యారోగ్యశాఖ నివేదిక పరిశీలించిన…
పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. 70 శాతం వరకు పన్నుల రూపంలో దోచుకుంటున్నారు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.కేంద్ర ప్రభుత్వ ముందు చూపు లేకపోవడంవల్లనే కరోనాను అరికట్టడంలో విఫలమయ్యారు. పీఎం కేర్ పేరుతో వేల కోట్లు వసూలు చేస్తున్నారు అని తెలిపారు. ముందుచూపు లేకపోవడం వల్లనే వ్యాక్సిన్ అందరికి వేయలేక పోయారు. సొంతంగా భారత దేశంలో వ్యాక్సిన్ తయారు అవుతున్నా. ఇక్కడి…