చిత్తశుద్ధి లేని శివపూజలా ఉందట.. తెలంగాణలో ఉద్యోగ ఖాళీల గుర్తింపు. నెలల తరబడి కసరత్తు చేశామని చెబుతూ.. అధికారులు ఇచ్చిన జాబితాపై సీఎం సంతృప్తి చెందలేదు. వారికి మరో డెడ్‌లైన్ పెట్టారు. అసలు ఆఫీసర్లు వాస్తవ లెక్కలే ఇచ్చారా? లేక తిమ్మిని బమ్మిని చేయాలని చూశారా? ఉద్యోగ ఖాళీల లెక్కలను అధికారులు సరిచూసుకున్నారు గత డిసెంబర్‌లోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. వెంటనే ఖాళీలను గుర్తించి నియామక ప్రక్రియ చేపట్టాలని…
మొదటి సారిగా ప్రెస్ మీట్ నిర్వహించిన వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ గడ్డపై కొత్త పార్టీ స్థాపించామని… వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ వ్యతిరేకి అవునా, కాదా అనేది గ్రామాల్లో తెలుసుకోవాలన్నారు. వైఎస్సార్ తెలంగాణకు వ్యతిరేకి కాదని… ప్రత్యేక తెలంగాణ అవసరం అని 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి చెప్పారని గుర్తు చేసిన షర్మిల…యూపీఏ మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణ ఏర్పాటు అంశం చేర్చారని తెలిపారు. మేము తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పలేదని…ఇది నా గడ్డ.. దీనికి…
సైకిల్ దిగి కారెక్కిన ఎల్ రమణ లోడ్ ఎత్తాలా? ఆయనకు ఎలాంటి పదవీ యోగం ఉంది? ఈటల ఎగ్జిట్ తర్వాత రమణకు రెడ్‌కార్పెట్ పరిచిన టీఆర్ఎస్.. కేబినెట్‌లోకి తీసుకుంటుందా? ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆయనకు ఇచ్చిన మాటేంటి? ఈటల ఎపిసోడ్ తర్వాత పెరిగిన ప్రాధాన్యం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉంటూ.. ఆ పదవికి రాజీనామా చేసి.. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్ రమణకు అధికారపార్టీలో లభించే ప్రాధాన్యం ఏంటి? మారిన రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఆయనకు కలిసి…
“ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం” (World Youth Skills Day) సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సాధించుకున్న రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్తు యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా ప్రభుత్వం తెలంగాణను తీర్చిదిద్దుతున్నదన్నారు. అందుకు తగ్గట్టుగా పకడ్బందీ ప్రణాళికలను రచించి అమలు చేస్తున్నదని సీఎం తెలిపారు. గత పాలనలో అన్నిరంగాల్లో శిథిలమైన మౌలిక వసతులను తీర్చిదిద్దుకుని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పునరుజ్జీవింపచేసుకుంటూ వస్తు న్నామన్నారు. సకల జన జీవనం…
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగంలో ఇప్పటికే లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు సీఎం కేసీఆర్… నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో క్లారిటీ రావడంతో మరో 50 వేల ఉద్యోగాలకోసం కార్యాచరణ రూపొందించామన్నారు.. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు ఉంటాయని తెలిపారు. ఇక, అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలను తెలంగాణ ప్రజలు దక్కించుకోవడం ఇప్పటికే ప్రారంభమైందన్న ముఖ్యమంత్రి… దండుగన్న వ్యవసాయం నేడు పండుగలా మారడమే అందుకు ఉదాహరణగా…
తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం అప్పుడు ఉద్యమించాం… ఇప్పుడు కేసీఆర్‌ను గద్దె దించేందుకు కార్యకర్తలు ఉద్యమంలా పనిచేయాలంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారానికి చమరగీతం పడాలంటే ప్రతి బీజేపీ కార్యకర్త సైనికుల్లా పనిచేసి, బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషిచేయాలన్నారు.. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర సంపదను దోచుకొని…
తెలంగాణలో త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. కొత్త జోన్లు, కొత్త జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీ, ఖాళీల గుర్తింపు తదితర అంశాలపై కసరత్తు సాగుతోంది.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తుందనే 50 వేల ఉద్యోగాలు అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ సోయం బాపురావు… ప్రతి ఎలక్షన్ సమయంలో 50 వేల ఉద్యోగలు ఇస్తానని సీఎం ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించిన ఆయన..…
ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లు నీటి మీద రాతలే… అందుకే నిరుద్యోగ యువత ఆత్మహత్య యత్నాలు చేసు కుంటున్నారు అని అన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు Nvss ప్రభాకర్. సీఎం చెప్పిన అధికారులు ఉద్యోగ ఖాళీలు ఇవ్వక పోవడం సీఎం అసమర్థతే కారణం… ఇది నిరుద్యోగులను వంచించడమే అని తెలిపారు. గో హత్య యథేచ్ఛగా రాష్ట్రంలో సాగుతోంది.. ప్రభుత్వం పైపై చర్యలు మాత్రమే తీసుకుంటుంది. నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరుస్తోంది. అసదుద్దీన్ ఒవైసీ డీజీపీకి లేఖ రాసాడు……
హుజురాబాద్ ఎన్నికలపు యమా అని రెండు రోజుల పాటు కేసీఆర్ క్యాబినెట్ మీటిం అయితే పెట్ట గలిగారు కానీ ప్రజలకు ఉపయోగ పడే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. 7 ఏళ్ల తర్వాత నిద్ర లేచి ఈ రోజు ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్స్ గురించి సీఎం మాట్లాడుతున్నారు. 2014 లోనే కేంద్రం లోని మోడీ ప్రభుత్వం రాష్ట్రం లో నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం లో…
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది కేబినెట్.. సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని.. అందుకు సరికొత్త పోస్టుల అవసరం…