సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో వరుసగా రెండోరోజు సమావేశమైన తెలంగాణ కేబినెట్.. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంది… రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేసి…
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా మరోసారి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కే అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తన పాటతో ఉద్యమాన్ని రగిలించిన ప్రజా వాగ్గేయకారుడు, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయికి సమున్నత గౌరవం కలిపించింది ప్రభుత్వం.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. దానికి ఛైర్మన్‌గా రసమయిని నియమించారు.. అయితే, ఆయన పదవి కాలం ముగిసిన తర్వాత కొన్ని ఏళ్లుగా ఖాళీగా…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమవేశమైన కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది.. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులు, మరియు అధికారుల కేటాయింపులు చేపట్టాల్సిందిగా టీఎన్ జీవో , టీజీవో ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు చేసిన విజ్జప్తిని పురస్కరించుకుని అందుకు సంబంధించి కేబినెట్ చర్చించింది. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే…
హుజురాబాద్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు.. కానీ, అప్పుడే ఉప ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. ఓవైపు.. టీఆర్ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ విజయం సాధిస్తానన్న ధీమాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రంగంలోకి దిగగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు నియోజకవర్గంలో మకాం వేసి పావులు కదుపుతున్నారు.. ఇదే సమయంలో.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమిపాలైన కౌశిక్‌రెడ్డి ఆడియో సంచలనం సృష్టించింది.. ఆ వెంటనే షోకాజ్ నోటీసులు, రాజీనామా,…
హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలకు తెర లేపుతోందని.. ఎమ్మెల్యేలు, మంత్రులు, వంద మంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు రఘునందన్ రావు. 14 ఏళ్ల ఉద్యమ పార్టీ.. ఏడేళ్ల అధికార పార్టీ.. ఒక్క బీసీ నాయకుని తయారు చేసుకోలేక పోయిందని చురకలు అంటించారు. గతంలో దుబ్బాకలో లక్ష మెజారిటీతో గెలిచినట్టు… హుజురాబాద్ మాదే అని ప్రకటనలిస్తున్నారన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని నోట్ల కట్టలు వెదజల్లినా ఎవరికి పట్టం…
మరోసారి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్ పార్టీ మంత్రులపై బీజేపీ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. “తెలంగాణ మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పే కల్లబొల్లి కబుర్లలోని మాయలేంటో జంటనగరాల ప్రజలకు బాగా తెలుసు… వానలు పడినప్పుడల్లా కాల్వల్ని తలపించే హైదరాబాద్, సికింద్రాబాద్ వీధులు, నాలాల బారిన పడి జనం విలవిలలాడుతుంటే…. వర్షాలు తగ్గగానే ఈ సమస్యలు మళ్ళీ తలెత్తకుండా చూస్తామంటూ గత ఏడేళ్ళ నుంచి పాలకులు చెబుతుండటం… జనం వింటుండటం మామూలైపోయింది. ఇప్పుడు వరంగల్ ప్రజలకు…
ఆ మధ్య వరంగల్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల పేర్లను మార్చనున్నట్టు ప్రకటించారు.. దానికి అనుగుణంగా.. ఇవాళ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం.. వరంగల్ రూరల్ జిల్లాను హనుమకొండ జిల్లాగా.. వరంగల్ అర్బన్ జిల్లాను వరంగల్ జిల్లాగా మారుస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు.. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు ఇచ్చింది. హనుమకొండ జిల్లాలోకి వరంగల్ జిల్లాలోని మండలాలు… వరంగల్ జిల్లాలోని మండలాలు హనుమకొండ జిల్లాలలోకి……
50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. 13న జరిగే కేబినెట్ లో ఉద్యోగాల ఖాళీ, భర్తీ పై చర్చ జరగనుంది. 50 వేల ఉద్యోగాల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం అయిన ఆర్థిక శాఖ… గతంలో ఇచ్చిన ఖాళీ వివరాల పై సమీక్ష జరపనుంది. శాఖల వారిగా ఖాళీల ఫైనల్ జాబితా తీసుకున్న ఫైనాన్స్…
గతం లో సాగు నీటి కోసం,కరెంట్ కోసం రాష్ట్రం లోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ నేడు కేసీఆర్ ప్రభుత్వం లో అటువంటి సమస్యలు లేవు. 24 గంటల కరెంట్ రైతులకు అందుబాటులో ఉంటుంది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నెలకు 12 లక్షల రూపాయలను రైతుల పేరు మీద ఎలక్ట్రిసిటీ కి తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. బ్యాంక్ ల నుండి అప్పు తీసుకుని రాష్ట్రంలో రైతాంగం పండించిన ప్రతి పంటను కొనుగోలు…
మదనపల్లె పర్యటనలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రా సీఎంలు కలసి బోంచేసి ముద్దులు పెట్టుకోవడం కాదు. ఇద్దరు కలసి కర్ణాటక లోని అల్ మట్టి, మహారాష్ట్ర లోని బీమా నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోండి. అక్కడ డ్యామ్ లు కడితే కృష్ణా నది ఎడారిగా మారుతుంది అన్నారు. సీఎం జగన్ కు రాజకీయ బిక్ష పెట్టింది రాయలసీమ ప్రజలే అని… అలాంటి రాయలసీమకు కృష్ణా…