సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 8 రోజులుగా ఢిల్లీలో బిజీబిజీ గా ఉన్న సీఎం కేసీఆర్…. ఇవాళ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ బయల్దేరనున్నారు. సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసిఆర్…. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై రాష్ట్ర సమస్యలు, అవసరాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహాయం పై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇద్దరు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలలో పాల్గొన్న తెలంగాణ సీఎం… కేంద్ర రహదారుల మంత్రి…
ప్రజా సంగ్రామ యాత్ర కి కేంద్ర నాయకత్వం మద్దతు పూర్తిగా ఉంది అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఈ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి పొర్లు దండాలు పెట్టడం కాదు.. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి. ఎక్కడికి వెళ్లినా ప్రజలు టీఆర్ఎస్ హామీలు గుర్తు చేస్తున్నారు అని చెప్పిన బండి సంజయ్ తెలంగాణ వచ్చిన తర్వాత విమోచన దినోత్సవం ను ఎందుకు జరపడం లేదు అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17 నిర్వహించే సభకి కేంద్ర హోంమంత్రి…
బీజేపీ గట్టిగా ఊదితే కొట్టకపోయే పార్టీ తెరాసా మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇంత దాదా గిరి చేస్తున్న నీకే ఇంత ఉంటే మాకు ఎంత ఉండాలి. మాకు సహనం ఉంది మౌనంగా చూస్తున్నాం. ఎన్ని తప్పులు చేస్తున్నావో లెక్క వేసి పెట్టుకుంటున్నాము. సందర్భం వచ్చినప్పుడు నీ భరతం పడతాం. కేసీఆర్ కాదు కదా ఆయన జేజెమ్మ దిగివచ్చినా హుజురాబాద్ లో గెలవలేరు అని తెలిపారు. ఛాలెంజ్ చేస్తున్న తాగుడు ఆపి, కొనుగోళ్లు ఆపి ప్రజాస్వామ్య…
తెలంగాణలో ‘బండి’ దూకుడుకు సీఎం కేసీఆర్ కళ్లెం వేశారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను బట్టి చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగిందే తడువుగా ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు ఇచ్చేశారు. వారంతా కేసీఆర్ కు రెడ్ కార్పెట్ పర్చడం చూస్తుంటే ఢిల్లీ పెద్దల వద్ద కేసీఆర్ కు ఎంత పలుకుబడి ఉందో అర్ధమవుతోంది.…
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయవారసుడిపై అప్పడప్పుడు చర్చ తెరపైకి వస్తూనే ఉంటుంది… ఏ ఎన్నికలు వచ్చినా.. ఇదిగో ఈ ఎన్నికల తర్వాత కాబోయే సీఎం కేటీఆరే నంటూ విమర్శలు వచ్చిన సందర్భాలు ఎన్నో.. ఇక, అంతా అయిపోయేది.. కేటీఆర్ సీఎం అవుతున్నారంటూ ప్రచారం సాగిన సందర్భాలు అనేకం.. మరికొందరు కేసీఆర్ రాజకీయ వారసుడు ఆయన మేనల్లుడు హరీష్‌రావు అనేవారు లేకపోలేదు.. కేటీఆర్ కంటే హరీష్‌రావు సీనియర్ అని వాదించేవారు కూడా ఉన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే…
ఆ మాజీ మంత్రి కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారా? విపక్షాలు వేగం పెంచడంతో టంగ్ స్లిప్ అవుతున్నారా? వివాదాస్పద కామెంట్స్ ప్రచారం కోసమా లేక ఫస్ట్రేషన్‌తో చేస్తున్నారా? ఎవరా మాజీ మంత్రి? హామీ ఇస్తే విపక్షాలకు 6 నెలలు అధికారం అప్పగిస్తారట! జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. మాజీ మంత్రి కూడా. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. ఆయనకు ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నారు? అనే ప్రశ్నలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలను నిలిపివేసి..…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ శిబిరాన్ని మాత్రం టెన్షన్ పెడుతోందా? హజురాబాద్ ఉపఎన్నికపై పడే ప్రతికూల ప్రభావంపై లెక్కలు వేస్తున్నారా? బీజేపీలో చేరేముందే ఏ అంశంపై అయితే ఈటల స్పష్టత కోరారో.. ఇప్పుడు అదే మళ్లీ చర్చకు వస్తోందా? సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ చూపించే ప్రభావంపై ఈటల వర్గం ఆరా? అదిగో.. ఇదిగో తేదీ ప్రకటించేస్తారని అనుకుంటున్న వేళ హుజురాబాద్ ఉపఎన్నికపై కేంద్ర…
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనే టార్గెట్‌గా విమర్శలు సంధించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్‌తో బీజేపీ ఎప్పటికీ కలవదని స్పష్టం చేశారు. దళిత బంధులాగే.. బీసీ, గిరిజన బంధు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి కేసీఆర్ ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్. 10వ రోజు పాదయాత్ర కొనసాగించిన ఆయన.. ఢిల్లీలో తెలంగాణ భవన్ దేని కోసం? ఎవరి కోసం కడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ…
ఒకే దెబ్బకు చాలా పిట్టలు.. కేసీఆర్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఏకంగా 50వేల ఉద్యోగాల ప్రకటన.. జాబ్ క్యాలెండర్ ను దసరాకు రిలీజ్ చేసి అటు వైఎస్ షర్మిలకు ఎజెండా లేకుండా చేయడం.. ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నోరు మూయించడమే ధ్యేయంగా ముందుకెళుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే తెలంగాణ నిరుద్యోగుల ఆశలు నెరవేరడంతోపాటు వైఎస్ఆర్ టీపీ, కాంగ్రెస్ లను దెబ్బతీయవచ్చని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట.. హుజూరాబాద్ ఉప ఎన్నికల సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రత్యర్థి…
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితి పై ఢిల్లీ నుంచి సీఎం కేసిఆర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పూర్తి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సిఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. భారీ వానల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా శాఖల…