మంత్రి హరీష్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్ల పల్లిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. హరీష్ అన్న బాగా ఎగురుతున్నావట ఆరు నెలల తర్వాత నిన్ను కూడా అవతల పెడతారు అని వ్యాఖ్యానించారు.. అంతే కాదు.. అప్పుడు హరీష్ అన్నని గెలిపించాలని మళ్లీ మన యువకులు తిరగాల్సి వస్తది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఈటల రాజేందర్ ను రాత్రికి రాత్రి…
తెలంగాణలో పోడు భూముల సమస్య ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.. గిరిజనులు పోడు చేసుకోవడం.. ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం.. తోపులాటలు, ఘర్షణలు, దాడులు.. ఇలా.. చాలా సందర్భాల్లో సమస్యలు వస్తున్నాయి.. అయితే, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కై పోడు భూములకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు.. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు సీఎస్ సోమేష్ కుమార్..…
ఏపీ సర్కార్ పై మరోసారి ఫైర్ అయ్యారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఏపీలో జగనన్న విద్యుత్ వాత అనే పథకాన్ని ప్రవేశపెట్టారని… ప్రస్తుతం జగనన్న విద్యుత్ వాత కాస్త కరెంట్ కొత అయ్యిందని జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు సీఎం జగన్. శ్రీకాకుళం లో 6 గంటల నుండి 10 గంటల వరకు కరెంట్ కొత పెట్టారని.. త్వరలో రాష్ట్రం అంతటా ఉంటుందని మండిపడ్డారు. అదే పక్క రాష్ట్రం తెలంగాణలో విద్యుత్ కోత లేదని……
కరీంనగర్ జిల్లా : జమ్మికుంటలో కవాతు చేయాలని మహిళలు కోరుతున్నారని… తప్పకుండా త్వరలోనే చేస్తామని పేర్కొన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. జమ్మికుంట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తనకు సపోర్ట్ గా ఉన్న నాయకులను పట్టండని కెసిఆర్ ప్రగతి భవన్ లో ప్లాన్ వేస్తే.. హరీశ్ రావు అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈరోజు ఉన్న నాయకులు రేపు తనతో ఉండడం లేదని…
నల్గొండ : మీరు మీ పిల్లలు బాగుంటే సరిపోతుందా…విద్యార్థుల భవిష్యత్ పై సీఎం కేసీఆర్ కు ఆలోచన లేదా ? అని నిలదీశారు వైఎస్ షర్మిల. బాగా చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదా…?ఇప్పుడు యూనివర్సిటీ భూములపై టీఆరెస్ నాయకుల కన్ను పడిందని ఆరోపించారు. ఎంజీ యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… ఎంజీ యూనివర్సిటీ…
నల్గొండ ఎంజీ యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఆవిడ మాట్లాడుతూ… ఎంజీ యూనివర్సిటీ వైఎస్సార్ కట్టించినది. పేద బిడ్డలకు విద్యను అందించేందుకు వైఎస్సార్ యూనివర్సిటీ నిర్మిస్తే కనీసం ఒక్క ప్రొఫెసర్ పోస్టు భర్తీ కూడా చేపట్టలేదు. ఎంజీ యూనివర్సిటీలో 10 మంది ప్రొఫెసర్లకు అందరూ ఖాళీలు. 50 శాతం స్టాఫ్ తో యూనివర్సిటీ నడుస్తోంది. యూనివర్సిటీ సమస్యలపై ఎన్ని లెటర్ లు రాసినా పట్టించుకునే నాధుడే లేరు.…
మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన సందర్భంగా తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మోహన బాబు మాట్లాడుతూ కేసీఆర్ గారిని ఎప్పుడైనా సన్మానించామా? అని ప్రశ్నించారు. అంతకు ముందు టాలీవుడ్ లో ఉన్న సంప్రదాయాలను పాటించాలని, అసలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎలా ప్రసన్న చేసుకోవాలి? అనే విషయాలను వెల్లడించారు. మోహన్ బాబు మాట్లాడుతూ “ఆలోచించు, సహాయం కోరుకో. బాధ్యతలు పెట్టుకున్నావు. ముఖ్యమంత్రుల సహాయం లేకపోతే మనమేం లేయలేము. మనం ఏమేం కోల్పోయామో……
శంషాబాద్ మండలం పరిధిలోని శ్రీరామనగరంలోని జీవా ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిజీ, తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారితో కలిసి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని జమ్మి మొక్కను నాటారు. అనంతరం చిన్నజీయర్ స్వామీజీ మాట్లాడుతూ.. “వృక్షో రక్షతి రక్షితా:” అన్నారు మన పెద్దలు. కానీ, ఆధునిక మానవుడు చెట్లను కొట్టేస్తూ..కొండలను తవ్వేస్తూ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు. ఈ తరుణంలో మన భారతీయ సంస్కృతి భూమి గురించి, ప్రకృతి గురించి,…
టెన్త్ పరీక్షా పేర్లను కుదించారు. ఈ ఏడాది పదో తరగతిలో ఆరు పరీక్షలే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పదో తరగతి పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 11 పేపర్లకు బదులుగా ఆరు పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే.. ఈ సారి పరీక్ష సమయం 2 గంటల 45 నిమిషాల నుండి 3…
కమలాపూర్ మండలం లోని శ్రీరాములపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… కేసీఆర్ మాట్లాడితే ఒకనాడు తెలంగాణ పులకించింది. అడుగులో అడుగు వేసింది. ఈ రోజు ఎవరు ఎక్కువ ఆయన్ను తిడితే అంత ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. అంటే అయన పెరిగినట్ట, తరిగినట్టా? అయన చరిత్ర హీనం అవుతుంది. కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉండి కత్తి అందిస్తే హరీష్ వచ్చి పొడుస్తుండు. కాళోజీ చెప్పినట్టు ప్రాంతం…