రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో ఈ నెల 20న ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటివి పటిష్టంగా అమలు చేసింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు సిఎం కేసిఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకానికి బ్రేక్ పడింది. దళిత బంధును నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు తెరాస ప్రభుత్వం దళిత బంధు అనే పథకాన్ని తెచ్చి రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ పథకాన్ని హుజురాబాద్ నుండే ప్రారంభించనున్నట్లు తెలిపింది. దాంతో దీని పై చాలా ఫిర్యాదులు…
మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో ఈరోజు చేరారు. ఆయనను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ అనంతరం మాట్లాడుతూ… నన్ను తిట్టినన్ని తిట్లు ఈ దేశంలో ఎవరని తిట్టలేదు. ఒక మాయావతి ఇంటికి 19 సార్లు పోయినా.. తెలంగాణ గురించి మాయావతికి చెప్పా.. అలాగే 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించాం అని గుర్తు చేసారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పడు అనేక సమస్యలు ఉన్నాయి. కింద మీద పడి ఒక రాస్తా ఎసుకుని…
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… కేసీఆర్ పచ్చటి సంసారంలో నిప్పు పెట్టారు. మానవ సంబంధాలకు మచ్చ తీసుకు వస్తున్నారు. గొల్ల కురుమలకు గొర్లు నా రాజీనామా తరువాతనే… అది కూడ హుజూరాబాద్ మాత్రమే వచ్చాయి. అది మీ మీద ప్రేమ కాదు, మీ ఓట్ల మీద ప్రేమ. పెద్దపల్లి ఎమ్మెల్యేకి టికెట్ నేనే ఇప్పించిన, గెలవడానికి నేనే వెళ్లి ప్రచారం చేసిన. ఇప్పుడు ఆయన కూడా…
హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి ఫోకస్ నెలకొంది. తెలంగాణతోపాటు ఏపీలోనూ హుజూరాబాద్ ఉప ఎన్నికపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుండటంతో హుజూరాబాద్ లో ఎవరు జెండా ఎగురవేస్తారా? ఆసక్తి నెలకొంది. పోలింగ్ సమయంలో దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అయితే ప్రచారం ముగింపు రోజున సీఎం కేసీఆర్ తనదైన స్టైల్లో ఓటర్లను ఆకట్టుకునేలా భారీ బహిరంగ నిర్వహించి ఫినిషింగ్ టచ్…
యాదాద్రికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. రేపు యాదాద్రి పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఉదయం 11.30 కు హైద్రాబాద్ నుండి బయలుదేరి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తి స్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీటిని రేపటి పర్యటనలో మరోసారి సిఎం కెసిఆర్ పరిశీలిస్తారు. యాదాద్రి పున: ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామివారు నిర్ణయించి వున్నారు. ఇక రేపు యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటిస్తారు. పున:…
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు.. సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు మధ్యాహ్నం 12 గంటలకు లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయనున్నారు మోత్కుపల్లి. తర్వాత బషీర్ బాగ్ చౌరస్తా లోని మాజీ ఉప ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత గన్ పార్క్ లోని అమరవీరుల…
తెలంగాణ భవన్ లో కాసేపటి క్రితమే టీఆర్‌ఎస్ పార్టీ కార్యవర్గసమావేశం ముగిసింది. ఈ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగగా.. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో మనమే గెలుస్తున్నామని.. ఈ నెల 27 హుజురాబాద్ లో ప్రచార సభకు తాను వస్తానని ప్రకటించారు. అలాగే… ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ ప్రజా గర్జన సభ ఉండాలని… మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలన్నారు.…
తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ఎంపీల సమావేశం ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే… టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. ఈ నెల 25 న హైదరాబాద్‌లోని హైటెక్స్ లో నిర్వహించనున్న ప్లీనరీ సమావేశం పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అలాగే… వచ్చే నెల…
హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే యావత్ తెలంగాణ ప్రజల దృష్టి నెలకొంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీల నేతలంతా హుజూరాబాద్ కేంద్రంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ లో ఇప్పటికే ఓసారి సర్వే నిర్వహించిన అధికార పార్టీ మరోసారి సర్వే చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గులాబీ బాస్ ఆదేశాలతో సర్వే ఏజెన్సీలు, నిఘా వర్గాలు మరోసారి రంగంలోకి దిగి రీ సర్వే చేపడుతున్నాయి. ఈ…