పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం.. దరఖాస్తుల స్వీకరణ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పోడు భూముల సమస్య ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.. గిరిజనులు పోడు చేసుకోవడం.. ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం.. తోపులాటలు, ఘర్షణలు, దాడులు.. ఇలా.. చాలా సందర్భాల్లో సమస్యలు వస్తున్నాయి.. అయితే, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కై పోడు భూములకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు.. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు సీఎస్ సోమేష్ కుమార్.. ఈ విషయంలో విధి విధానాలు నిర్ణయించేందుకు ఈ సమావేశం జరిగింది..
అక్టోబర్ మూడో వారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఈ సందర్భంగా వెల్లడించారు సీఎస్ సోమేష్ కుమార్.. ఇందుకు దరఖాస్తు ఏ విధంగా ఉండాలి, దరఖాస్తులో పొందుపరిచే అంశాలు, అటవీ సరిహద్దుల కోఆర్డినెట్స్ నిర్ణయం, వివిధ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు, అటవీ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ కన్సర్వేటర్లు, డీఎఫ్‌వోలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.. కాగా, పోడు భూముల సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపనున్నట్టు ఈ మధ్యే సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే.
Also Read
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!