పింఛన్ల దరఖాస్తు గడువును మళ్లీ పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన పేదలందరికీ ఆసరా వృద్ధాప్య పింఛన్లు అందించడానికి సిద్ధం అవుతుతోన్న సర్కార్.. అందులో భాగంగా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది.. ప్రభుత్వం పెట్టిన గడువు ప్రకారం.. గత నెలలోనే గడువు ముగిసిపోగా.. మరో అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు సీఎస్ సోమేష్ కుమార్.. మీసేవ కేంద్రాల్లో ఈ నెల 11వ తేదీ…
జోగుళాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి లో భారీ వర్షాల కారణంగా ఇవాళ ఉదయం గోడ కూలి.. ఐదుగురు మృతి చెందారు. అయితే.. కొత్తపల్లి ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి కి ఫోన్ చేసి దుర్ఘటనపై ఆరాతీశారు ముఖ్యమంత్రి కేసీఆర్. మృతులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ఇక సీఎం కేసీఆర్ ఆదేశాలపై స్పందించిన మంత్రి…
తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు అక్టోబర్ మూడోవారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పోడు భూముల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తరువాత ఒక్క గజం జాగ అటవీ భూమి భవిష్యత్తులో అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని, దురాక్రమణలు అడ్డుకోవడానికి కావాల్సిన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని సిఎం స్పష్టం చేశారు. అడవులను రక్షించుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలకైనా వెనకాడబోదన్నారు. పోడు సమస్యను పరిష్కరించే క్రమంలో అఖిలపక్ష సమావేశం…
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజుల పాటు జరిగాయి. మొత్తం అరు బిల్లులకు సభ ఆమోదం తెలపగా… ఆరు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మొత్తం 32 గంటల 5 నిమిషాలు సభ జరిగింది. ఆఖరి రోజు సభలో సంక్షేమ పధకాలపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వాలని కోరారు భట్టి. ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ అర్హులకు అందడం లేదని…
దేశ చరిత్రలో హుజురాబాద్ ఎపిసోడ్ చీకటి అధ్యాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా నియోజకవర్గ ఎపిసోడ్ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా అభివర్ణించారు. అడ్డదారుల్లో ప్రలోభాలతో మద్యం, డబ్బుతో గెలవాలని టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని ఆరోపించిన ఈటల రాజేందర్.. నాయకులకు, ప్రజా ప్రతినిధులకు కొనుగోలు చేసే దారుణం జరుగుతోందని ఆవేదన వ్యక్తం…
టీఆర్ఎస్ సర్కార్‌లో పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేదర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. దళిత జాతి ఆత్మగౌరవం కోసం నా చిన్న నాడే కొట్లాడి మా కుల బహిష్కరణకు గురైన వాళ్లం.. అలాంటి కుటుంబం మాది అని గుర్తు చేసుకున్నారు.. ఇక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీ హృదయాల్లో చోటు సంపాదించుకున్న వాడిని.. కేసీఆర్‌తో ఆరేళ్లుగా అనుభవిస్తున్న బాధ…
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులకు పదవీయోగం ఉందా? ఆ పదవి ఏంటో.. సీఎం కేసీఆర్ ఆయనకు చెప్పేశారా? గులాబీ కండువా కప్పుకోగానే అధికారికంగా ప్రకటన చేసేస్తారా? టీఆర్‌ఎస్‌లో ఆయన చేరిక హుజురాబాద్ ఉపఎన్నిక కంటే ముందే ఉంటుందా.. లేదా? సీఎం కేసీఆర్‌తోపాటు అసెంబ్లీకి రావడంతో చర్చల్లోకి మోత్కుపల్లి..! బీజేపీకి దూరమైన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. రేపోమాపో టీఆర్ఎస్ కండువా కప్పేసుకుంటారని చర్చ జరిగినా.. తర్వాత…
ఈటల రాజేందర్.. రాముడు మంచి బాలుడు లాంటి వ్యక్తి.. కానీ, ఆయన్ను కూడా మోసం చేశారు రంటూ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఫైర్ అయ్యారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబు మోహన్… కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజేందర్ అన్న రాముడు మంచి బాలుడు లాంటి వాడు.. ఆయన్ను కూడా మోసం చేసింది కేసీఆర్ కుటుంబం అని ఆరోపించారు.. కేసీఆర్ అయన…
తెలంగాణ రాష్ట్రంలో.. బస్తీ దవాఖానాల తరహాలోనే గ్రామ దవాఖానలు కూడా త్వరలోనే రాబోతున్నాయని..దీని కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 5 లక్షలు ఆదాయం ఉండేట్టు చేశామని.. గ్రామ పంచాయతీ లు ఇప్పుడిప్పుడే లైన్ లో పడుతున్నాయని వెల్లడించారు. 12,769 గ్రామాల్లో 9 వేల కార్యదర్శుల పోస్టులు కొత్తవి వేశామని.. అన్ని పోస్టులకు ప్రమోషన్ కూడా ఇచ్చేశామని తెలిపారు.…