సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆమె… వరుస ట్వీట్లతో ప్రభుత్వాన్ని ఎండగట్టారు.. ‘రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా… రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతున్నాయి. రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’…
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్.. తీరొక్కపూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటాపాటలతో ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.. ఒకనాడు సమైక్యపాలనలో విస్మరించబడిన బతుకమ్మను స్వయం పాలనలో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్న ఆయన… తెలంగాణ ప్రజల జీవనంలో భాగమైపోయిన ప్రకృతి పండుగ బతుకమ్మ, నేడు ఖండాంతరాలకు విస్తరించడం గొప్పవిషయమన్నారు. తెలంగాణ సంస్కృతికి…
దళితబంధుపై చర్చ సందర్భంగా సుదీర్ఘ వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్ పలు అంశాలపై స్పందించారు… అయితే, అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను అవమానిస్తారా? అంటూ ఫైర్ అయిన ఆయన.. సీఎం సోయిలో లేకముందే రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చింది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు. అర్హులైన వారికి పద్మశ్రీ అవార్డులిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్న ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనన్న ఆయన……
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. 72, 500 బోనస్ చెల్లించనున్నారు. ఈమేరకు సింగరేణి ప్రకటించింది.. గతేడాది కార్మికులకు 68,500 బోనస్ ను సింగరేణి చెల్లించింది.. ఈసారి బోనస్ మొత్తాన్ని పెంచింది.. తాజా నిర్ణయంతో సింగరేణిలో ఉన్న 43 వేల మంది కార్మికులకు లబ్ధి కలగనుంది. ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు భేటీ అయి బోనస్ పై నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ (పీఎల్ ఆర్) 72,500…
దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ సర్కార్… ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలోని అన్ని దళిత కుటుంబాలకు ఈ నింధులు అందగా… హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ దళిత బంధు నిధులు విడుదల చేశారు.. ఇదే సమయంలో… రాష్ట్రంలోని మరో నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు మండలాలను కూడా ఎంపిక చేశారు సీఎం కేసీఆర్… అయితే, దళిత బంధుకు నిధులు ఎలా వస్తాయి అనే అనుమానాలు మాత్రం ప్రతిపక్షాలను తొలచివేస్తున్నాయి.. ఈ తరుణంలో దళితబంధుపై అసెంబ్లీ…
మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రారు.. దళితబంధు పథకంపై అసెంబ్లీలో సుదీర్ఘ వివరణ ఇచ్చిన ఆయన.. ఈ సందర్భంగా వివిధ అంశాలను ప్రస్తావించారు.. కేంద్ర ప్రభుత్వంపై ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ లో మనం శాసించే కేంద్ర ప్రభుత్వం రావొచ్చు అన్నారు.. కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం పడొచ్చు.. లేకపోతే.. ఇప్పుడు ఉన్న కేంద్రమే మనల్ని కనికరించ వచ్చునని కామెంట్ చేశారు.. అనేక దఫాలుగా కేంద్రాన్ని నిధులు కూడా అడిగాం.. మీరు కూడా…
కరీంనగర్ అబాది జమ్మికుంట బీజేపీ పార్టీలో ఈ రోజు భారీగా చేరికల జరిగాయి. ఆ సందర్భంగా సీఎం కేసీఆర్ పై హాట్ కామెంట్స్ చేసారు ఈటల రాజేందర్. మీ డబ్బులకు, మీ మద్యం సీసాలకు నాగార్జునసాగర్ కోదాడలో రిజల్ట్ రావచ్చు. కానీ హుజురాబాద్ లో మాత్రం ఆత్మగౌరవానికే రిజల్ట్ వస్తుంది అని స్పష్టం చేసారు. ఆత్మగౌరవ ప్రతీక,పేదప్రజల గొంతుక ఈటల రాజేందర్. జమ్మికుంట పట్టణంలో ఎవరి ఫ్లెక్సీలు, ఎవరి ముఖాలు ఉన్నాయి. ఈటల ఫ్లెక్సీలు, జెండాల పెడితే…
జమ్మికుంటలో కిసాన్ మొర్చ సమావేశానికి ఈటల రాజేందర్, సోమారపు సత్యనారాయణ, యెండల లక్ష్మీనారాయణ హాజరయ్యారు. అక్కడ ఈటల రాజేందర్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ మీటింగులకు బయట నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించి మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హుజురాబాద్ ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే ప్రజలు కాదు. కేసీఆర్ కు టీఆర్ఎస్ గెలుస్తుందన్న విశ్వాసం లేక తొండాట ఆడుతున్నాడు. జిత్తుల మారి ఎత్తులతో కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాడు. తన టక్కుటమార విద్యలు ఇక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చురకలు కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ విజయం ఖాయమని… ప్రతి ఎన్నికకు సవాల్ చేయడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. హుజురాబాద్ నియోజక వర్గంలో గెల్లు శ్రీనివాస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. నిన్న మమతా బెనర్జీ గెలిచింది- మోడీ రాజీనామా చేస్తారా? మమతా బెనర్జీ ఎన్నిక బీజేపీ ఛాలెంజ్ గా తీసుకుంది…
హుజూరాబాద్ ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కరెన్సీని గెలిపిస్తారా? బీజేపీ కాషాయం జెండాను గేలిపిస్తారా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఉద్యమ కారుడు మంచి నాయకుడు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని హుజూరాబాద్ లో నింపారు. ఇక్కడి ప్రజలు చైతన్యం కలిగిన ప్రజలు. అయితేప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచు కున్న నేత ఈటల రాజేందర్. ఆయన కల్మషం లేని బోలా మనిషి ఆయనకు అన్యాయం చేస్తే…