టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం లో అధికారికంగా ప్రకటించారు టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు. దీంతో ఏకంగా 9 వ సారి టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఎన్నిక అయ్యారు. ఇక అధ్యక్షులుగా ఎన్నికైన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఏక గ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. తొలిసారి 2001 సంవత్సరంలో జల దృష్యంలో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించామని చెప్పారు. రక…
టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ హైటెక్స్ వేదికగా ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు గులాబీ దళం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు ఆరు వేల మంది ప్రతినిధులు హాజరవుతారు. ప్రతినిధుల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి సెషన్ జరుగుతుంది. అయితే.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి టీఆర్‌ఎస్ పార్టీ కొన్ని డిమాండ్లు పెట్టింది.డిమాండ్లు :కూలల వారిగా బీసీ జనాభా లెక్కలు సేకరించాలి. అసెంబ్లీ…
హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆదివారం వీణవంక మండలంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. హుజురాబాద్‌లో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. తనకు మద్దతు ఇచ్చినా, బీజేపీకి ఓటు వేసినా…
హైదరాబాద్‌లో ఈనెల 25న ఉదయం 10 గంటలకు టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్లీనరీ సమావేశాన్ని అంగరంభ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భాగ్యనగరం మొత్తం గులాబీమయంగా మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరంలో జరిగే ఈ సమావేశానికి వచ్చే రహదారులన్నీ టీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, తోరణాలతో…
టీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నింపేలా ఆపార్టీ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగబోతున్నాయి. కరోనా, ఇతరత్రా కారణాలతో గడిచిన మూడేళ్లుగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుగలేదు. ఆ లోటును భర్తీ చేసేలా ఈసారి ప్లీనరీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేసింది. దీనిలో భాగంగానే భాగ్యనగరం గులాబీ మయంగా మారుతోంది. హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక ‘పింక్’ రంగు పులుముకుందా? అన్నట్లుగా అక్కడి వాతావరణం మారిపోయింది. దీంతో ఆపార్టీ శ్రేణులు, నేతల్లో రెట్టింపు…
ఒకాయన నన్ను కోతి అంటున్నరు. టీఆర్ఎస్ ను చూసి కోతులన్నీ భయపడి పోతున్నయ్. ఎందుకంటే గుంట నక్కలు, దండు పాళ్యం ముఠా లెక్క జనంమీద పడి దోచుకుంటున్నరు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బండి సంజయ్ కొదమ సింహం లాగా అడ్డుకుని కొట్లాడి తీరతడు.వచ్చేనెల 2న కేసీఆర్ కు ప్రగతి భవన్ లో ‘ట్రిపుల్ ఆర్ ’ సినిమా చూపిస్తాం. 30న జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తుకే అందరూ ఓటేయ్యాలి.…
తెలంగాణలో పోడు భూముల సమస్య పరిష్కారంపై శనివారం జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోడు భూములపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అటవీ భూముల రక్షణలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అడవులను పునరుజ్జీవింపజేయాలని కేసీఆర్ అన్నారు Read Also: అచ్చెదిన్: ఏడాదిలో రూ.306 పెరిగిన సిలిండర్ తెలంగాణలో అడవిపై…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ… కేసీఆర్ అహంకారం అణగాలి అంటే ఈటల రాజేందర్ గెలవాలి. తెలంగాణలో అభివృద్ధి చెందింది కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. ప్రజల తరపున మాట్లాడుతున్నారు అని ఈటెల రాజేందర్ కి మంచి పేరు వచ్చింది అని కేసీఆర్ కి కడుపుమండింది. ఈటల రాజేందర్ బయటికి నెట్టిన కేసీఆర్ నీ తెలంగాణ నుండి బయటికి నెట్టాలి. లేందంటే మనకు భవిష్యత్తు ఉండదు. ఈటల…
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో శనివారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకరమైనదని అభివర్ణించారు. ఎవరు ఎమ్మెల్యే ఉండాలి అనేది కాదు… ఈ రాష్ట్రం ఎటు పోవాలి అనే దాని కోసం ఈ ఎన్నిక జరుగుతోందన్నారు. ఇంతమంది జనం చూసిన తర్వాత ఇంకా ఎన్నిక నిర్వహించడం అవసరమా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ జనం చూసి కేసీఆర్…
తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారం పై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కాసేపటి క్రితమే ప్రగతి భవన్ లో ప్రారంభమైన ఈ సమీక్షా సమావేశంలో అడవుల పరి రక్షణ, హరిత హారంపై చర్చిస్తున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించనున్నారు. అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై, హరిత హారం ద్వారా విస్తృత ఫలితాల కోసం ప్రణాళికలపై చర్చించనున్నారు. పోడు సమస్యపై అటవీ, గిరిజన సంక్షేమ శాఖల…