తెలంగాణలో టీఆర్ఎస్- బీజేపీ నేతల అకృత్యాలకు ఉద్యోగులు, జనం బలి అవుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ. వనమా రాఘవ ఎపిసోడ్ ముగియక ముందే.. నిజామాబాద్ లో మరో సంఘటన మొదలైందన్నారు. నిజామాబాద్ లో నలుగురి ఆత్మహత్యలకు బీజేపీ నేతలు కారణం అన్నారు. ఎంపీ అరవింద్ అండ దండలతో దురాగతాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎంకి మానవత్వం ఉంటే వెంటనే జీఓ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మధుయాష్కీ
నలుగురు ఆత్మహత్యల వెనక బీజేపీ టీఆర్ఎస్ నేత హస్తం వుందన్నారు మధుయాష్కీ. వడ్డీ వ్యాపారులు ను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. కబ్జా లు ఎక్కువ అయ్యాయని, తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు కారణం అయిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ఉపాధ్యాయుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ బాధ్యత వహించాలన్నారు.
బీజేపీ వాళ్లకు ఏమైనా బుద్ది ఉందా? రేవంత్ ఫైర్
పరామర్శకు వెళ్ళిన జీవన్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని మధుయాష్కీ ఖండించారు. జీవో 317 విషయంలో ఉపాధ్యాయులు ఆలోచించాలన్నారు. మీ గొంతులు కోస్తున్నది టీఆర్ఎస్ అని గుర్తించాలన్నారు. రెండు సార్లు టీఆర్ఎస్ కే ఓట్లేశారు. ఈసారి టీఆర్ఎస్ కి పాతరేయండి. ఉద్యోగ సంఘాల నాయకులపై మధు యాష్కీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశ పడుతున్నారు. ఉద్యోగులు మేలుకోండి. మీ వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు.