తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నియంతగా ఎవరు వ్యవహరించినా ప్రజలు సహించన్నారు. కేసీఆర్ నిజాంల పాలన కొనసాగించాలని… తను ,తన తరవాత కొడుకు, కొడుకు తర్వాత ఆయన కొడుకు అధికారంలో ఉండాలని అనుకుంటున్నారన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 7 ఏళ్లలో ఏమి చేసిందో చర్చించేందుకు సిద్ధం. సీఎం సవాల్ స్వీకరిస్తున్నా అన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ‘హిందూస్థాన్, పాకిస్థాన్’ అనేది బీజేపీ జీవితకాల నినాదమని, ‘వీరి నాయకులకు జ్ఞానం లేదని’ ఆయన ఆరోపించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన తలసాని.. గత మూడేళ్లలో హైదరాబాద్‌కు కిషన్ ఏం చేశారని ప్రశ్నించారు. వరద సాయం కోసం కూడా కిషన్ ఒక్క రూపాయి…
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ కి రేవంత్ కౌంటర్ ఇచ్చారు. “మొసలి కన్నీరు” కార్చడం మీ నాయకత్వ ప్రావీణ్యం.ప్రధాని మోదీ తెలంగాణ తల్లిని, మన అమరవీరుల త్యాగాలను అవమానించినప్పుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కేసీఆర్ ను ఎప్పుడూ నమ్మవద్దు అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులను, తెలంగాణ తల్లిని ప్రధాని నరేంద్రమోడీ…
మహబూబ్‌నగర్, నల్గొండ పట్టణాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, నీలగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు (UDAలు) ప్రధాన నగరాలు, పట్టణాల చుట్టూ చక్కటి సమగ్ర మరియు ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని నిర్ధారించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. రోడ్డు నెట్‌వర్క్, నీటి సరఫరా, ఉపాధి అవకాశాలు మరియు శాటిలైట్…
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లక్షలాదిమంది భక్తుల రాకతో పులకించింది. అక్కడ ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహం కనులవిందుగా కనిపించింది. శ్రీరామనుజుల కీర్తి దశదిశలా మరోమారు వ్యాపించింది. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీరామనగరంలో 12 రోజుల పాటు జరిగిన మహా క్రతువులో వేలాది మంది రుత్వికులు.. లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అంకురార్పణ నుంచి మహా పూర్ణాహుతి వరకు నిత్యం ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. భారత దేశానికి చెందిన అతిరథ మహారథులు, రాజకీయ ప్రముఖులు సమతామూర్తిని…
బహదూర్‌పురా వద్ద ఆరు-లేన్ల ద్విదిశాత్మక ఫ్లైఓవర్ వేగంగా పూర్తవుతోంది. ఈ సౌకర్యం దశాబ్దాలుగా ఓల్డ్ సిటీని వేధిస్తున్న ట్రాఫిక్ గందరగోళాన్ని తగ్గించగలదని భావిస్తున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం చివరి దశలో ఉందని, మార్చి 31 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు తెలిపారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డీపీ) ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ను జీహెచ్‌ఎంసీ రూ.69 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తోంది. 690-మీటర్ల…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్య, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను బలోపేతం చేసేందుకు పెద్దపీట వేస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ థర్డ్ వేవ్ నుండి బయటపడేందుకు తెలంగాణ విజయవంతంగా చర్యలు చేపట్టడంతో పాటు మల్టీస్పెషాలిటీ హెల్త్ హబ్‌లు, మెడికల్ కాలేజీలు, దాదాపు అన్ని ప్రధాన తృతీయ శ్రేణి ఆసుపత్రులను రూ.6,000 కోట్లతో అప్‌గ్రేడ్ చేయడం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం…
నేటి నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్లో జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. రోజుకు 15 వేల చొప్పున టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. మరోసారి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం నేడు ఇన్‌పుట్ సబ్సిడీని అందజేయనుంది. ఈ రోజు రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీని సీఎం జగన్ జమ చేయనున్నారు. ఏపీలో నేటి నుంచి జెన్‌కో సంస్థల్లో ఉద్యోగుల సహాయ నిరాకరణ చేయనున్నారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్… ఆయనకు స్క్రిప్ట్ 10 జన్ పథ్ నుంచే వస్తుందని విమర్శించారు.. రాఫెల్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది… అవినీతి జరగలేదని చెప్పింది… కేసీఆర్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టే అన్నారు… కేసీఆర్ పీసీసీ చీఫ్ అవుతాడు… కాంగ్రెస్ నేతలరా మీ లీడర్ ఇక కేసీఆరే అంటూ సెటైర్లు వేశారు.. తాజాగా కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్స్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు బండి సంజయ్..…