తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పార్టీని వీడుతున్నారా? అనే ప్రచారం జోరుగా సాగుతోంది… ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌పై ప్రసంశలు కురిపించిన ఆయన.. ప్రభుత్వ పథకాలను ప్రశంసించారు.. ఇదే సమయంలో.. మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులపై కూడా బహిరంగంగా ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఎన్నో.. Read Also: Dharmana: కేసీఆర్ వ్యాఖ్యలతో…
వ్యవసాయ మోటర్లకు మీటర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీలో, ఇప్పటికే విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారంటూ కూడా ఆయన తెలిపారు.. ఇక, ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.. శ్రీకాకుళంలో వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు మనకు అనవసరం అన్నారు.. వ్యవసాయ బోర్లకు మీటర్లు వలన రైతులకు ఒక్క రూపాయి నష్టం ఉండదన్న…
తెలంగాణ ప్రభుత్వంపై కాసుల వర్షం కురిపిస్తోంది రిజిస్ట్రేషన్ల శాఖ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని రాబట్టింది… గతంలో ఎప్పుడూ రూ.10వేల కోట్ల మార్క్ చేరుకోలేదు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం.. గత ఆర్థిక సంవత్సరంలో 10 వేల కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకున్నా.. కేవలం రూ.5,243 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ రూ.12,500 కోట్లు పెట్టుకుంటే.. ఇప్పటికే రూ.10 వేల కోట్ల మార్క్‌ను దాటేసింది.. Read…
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఒక్క విషయంలో రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్‌కు అభినందనలు చెప్పాలని.. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకం అద్భుతం అంటూ సోమిరెడ్డి ప్రశంసలు కురిపించారు. రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా ప్రతి ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి సాయం చేస్తూ కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు పథకం తనకు నచ్చిందని సోమిరెడ్డి తెలిపారు. అటు దేశంలో…
ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పందించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్… పార్లమెంట్ సాక్షిగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకుంటే భావితరాలు క్షమించమని హెచ్చరించారు.. ఇక, ఏపీకి జరిగిన అన్యాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడాలని సూచించిన ఉండవల్లి.. బీజేపీని నిలదీసేందుకు ఏపీని కలుపుకోవాలన్నారు.. ఎనిమిదేళ్ల క్రితం లోక్‌సభలో ఏపీ విభజన బిల్లు ఆమోదం జరిగినట్టు ప్రకటించారని తెలిపారన్న ఆయన.. రాష్ట్ర విభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై…
హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఘనంగా ముగిసిన విషయం తెలిసిందే.. అయితే, ఈ నెల 14వ తేదీన శాంతి కళ్యాణం జరగాల్సి ఉండగా.. శనివారం సాయంత్రం అనగా రేపు శాంతి కళ్యాణం నిర్వహించనున్నట్టు వెల్లడించారు చిన్నజీయర్ స్వామి.. సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి రాత్రి 8 గంటల తర్వాత శాంతి కళ్యాణాన్ని పూర్తిచేయనున్నట్టు తెలిపారు.. రామానుజ చార్యుల సోపాన మార్గంలో కళ్యాణము నిర్వహిస్తామని.. 108 కళ్యాణాలు ఒకే చోట జరిగిన చరిత్ర లేదన్నారు.. ఇక,…
తెలంగాణ రాష్ట్ర పండుగ మేడారం జాతర వైభవంగా జరుగుతోంది. శుక్రవారం నాడు మేడారం జాతరకు విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని అమ్మవార్లను కోరుకున్నట్లు వెల్లడించారు. గతంలో తాను కోరుకున్న కోర్కెలను అమ్మవారు తీర్చారని.. ఇప్పుడు కూడా తన కోరికను అమ్మవార్లు తీరుస్తారని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా సమ్మక్క…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. తాజాగా ఈ వ్యవహారం మహిళా కమిషన్ వరకూ చేరింది. మహిళా కమిషన్ ని కలిసిన మాజీ మంత్రి గీతా రెడ్డి, రేణుకా చౌదరి రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పీఠం పై కూర్చున్న మూర్ఖుడు అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ అన్నారు గీతారెడ్డి. రాహుల్ గాంధీ పై చేసిన కామెంట్స్ సభ్య సమాజం…
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో.. పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలు చేయడంతోపాటు వారి సర్వీస్ ను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనదని ఆయన అన్నారు. పారిశుద్ధ్యం, హరితహారం, పన్నుల సేకరణ మొదలు దోమల నివారణ దాకా పంచాయతీ కార్యదర్శుల సేవలు మరువలేనివని ఆయన అన్నారు. పంచాయతీ కార్యదర్శులపై నిత్యం అధికార పార్టీ…
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 2,603 రైతు వేదికలను దేశంలో ఎక్కడాలేని విధంగా నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. రైతులను సంఘటితం చేసి, తద్వారా వచ్చే లాభాన్ని తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో 6…