ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఆస్క్ కేటీఆర్ (Ask KTR) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ట్విటర్ వేదికగా కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలంగాణలో మరోపార్టీకి అవకాశం లేదని, మూడోసారి కూడా టీఆర్‌ఎస్సే గెలుస్తుందన్నారు కేటీఆర్. అభివృద్ధి కొనసాగిస్తాం. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిని బీజేపీ అమ్ముకుంటోంది. బీజేపీ అసలు స్వరూపం ఇదే. బీజేపీ అంటే బేచో జనతాకి ప్రాపర్టీ. గ్యాస్ ధరల్లో…
తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ నేతల్ని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శిస్తే… బీజేపీ నేతలు తామేం తక్కువ తినలేదన్నట్టుగా మాటల దాడి చేస్తున్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు వాసుల నుంచి భూములు లాక్కుని, పునరావాసం, పరిహారం ఇవ్వలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ ఎక్కడుందని అడుగుతున్న టీఆర్ఎస్ నేతలకు ఇక్కడికొచ్చిన జనమే సమాధానమని తెలిపారు. ఉదండాపూర్ ప్రాజెక్టు పనులేమయ్యాయని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్…
పాలమూరులో బీజేపీకి వస్తున్న విశేష స్పందన, సభలకు వస్తున్న ప్రజలను చూశాక టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్ నేతలకు నోటికి దురద పెట్టినట్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ సన్నాసుల్లారా… 8 ఏళ్ల పాలనలో పాలమూరు ప్రజలకు చేసిందేమిటి? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ఆంధ్రా పాలకులకు అమ్ముడుపోయిన సన్యాసులు టీఆర్ఎస్ నేతలని మండి పడ్డారు. ఆంధ్రుకు అమ్ముడుపోయి తెలంగాణకు తాకట్టు పెట్టారని అన్నారు. ఈ…
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ జ్యోతి, చైతన్య దీప్తి అల్లూరి సీతారామరాజు 98వ వర్థంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉమ్మడి రాష్ట్రాల క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని అల్లూరికి ఘన నివాళులర్పించారు. ఆనాటి స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినా పోరాటాన్ని…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ థీమ్ ఒక్కటే.. దేశ సంపదను దోచుకోవడం అంటూ ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా 12 లక్షల కోట్లను లూటీ చేశారని, రాహుల్ గాంధీ పొలిటికల్ టూరిస్ట్ అంటూ మండిపడ్డారు. దేశ సంపదను దోచిన పార్టీ ఇంకా ఖతమవ్వలేదు.. ఆ పార్టీ ఇంకా కొనసాగుతోందని, రైతుల కష్టాలపై ఎలాంటి చింత…
Telangana IT and Industries Minister KTR laid the foundation for the Kitex unit at the Kakatiya Mega Textile Park Warangal, on Saturday. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు వరంగల్‌ను కాకతీయ మెగా పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా కంపెనీలు ప్రారంభించడానికి కొంత ఆలస్యం జరిగిందని, రాబోయే 18 నెలల్లో 20…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సభ్యత్వ సమన్వయ కర్తలతో రాహుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌కు ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేసిన రాహుల్.. కేసీఆర్ వద్ద ధనం, అధికార బలం, పోలీసులు ఉన్నారు, కానీ జన బలం లేదని విమర్శించారు. ప్రజల…
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ.. ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులందరికీ పాదాభివందనాలు చేస్తున్నానని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్‌టైల్ పరిశ్రమకు భూమిపూజ చేసిన సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. కిటెక్స్ టెక్స్ టైల్స్ పరిశ్రమతో పరకాల నియోజకవర్గంలోని వేలాది మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. రైతులు కష్టమైనా, నష్టమైనా ఓర్చుకొని ఇబ్బందైనా తట్టుకొని భూములు ఇచ్చిన వారందరికీ పేరుపేరునా…
వరంగల్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వరంగల్ సభపై మంత్రి జగదీష్ రెడ్డి తనదైన రీతిలో కామెంట్లు చేశారు. కాంగ్రెస్ హామీలు నీటి మూటలే అన్నారు. దారిపోయే దానయ్యలు మాట్లాడితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. రాసిచ్చిన చిలుక పలుకులు తప్ప రాహుల్ గాంధీ మాటల్లో పసలేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాహుల్ గాంధీ ఏ హోదాలో మాట్లాడారో చెప్పాలన్నారు. ఏ.ఐ.సి.సి ప్రతినిధిగానా…పీసీసీ ప్రతినిధిగా ఆయన…