కామారెడ్డి నియోజకవర్గంపై బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. మొదటిసారిగా కామారెడ్డి నియోజకవర్గ నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కామారెడ్డి జిల్లా జనగామకు చెందిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు.
నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో హస్తందే గెలుపు అని ధీమా వ్యక్తి చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాయకులకు కోసం కాకుండా 4 కోట్ల మంది ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఉందని, నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో హస్తందే గెలుపు అన్నారు. breaking news, latest news, telugu news, komatireddy venkatreddy, cm kcr
ఓడిపోయి ఇంటి దగ్గర ఉన్నోడిని తీసుకు వచ్చి మంత్రి పదవి ఇస్తే ఖమ్మం జిల్లాలో అయన పార్టీ కోసం చేసింది సున్నా అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు పాలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఖమ్మం నేతలపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులపై ఆయన మండిపడ్డారు.
రేపు వరంగల్ లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. రేపు వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన సందర్భంగా భారీ వాహనాలకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. గజ్వేల్ నాకు కొత్త కాదు..మీతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది.. నేను గజ్వేల్ వచ్చింది నాకు నియోజకవర్గం లేక కాదు.. 20 సంవత్సరాలు నాతో పని చేయించుకుని నా మెడలు పట్టుకుని బయటికి గెంటేశారు అని ఆయన ఆరోపించారు.
బీజేపీ పార్టీ వాళ్లు కావాలని గొడవలు చేశారు అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొ్న్నారు. దేవరకోట ఆలయ ఈవోని బెదిరించి అసభ్య పదజాలంతో దూషించారు అని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పారు.
నాగర్ కర్నూల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి.. ఎలక్షన్లు రాగానే ఆగం కావొద్దు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లు, కరెంట్ ఇస్థలేరని కర్ణాటక రైతులు గద్వాల, కొడంగల్ లో ఆందోళన చేస్తున్నారు.
Etala Rajender: హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేడు గజ్వేల్ కు రానున్నారు. గజ్వేల్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన మొదటిసారి నియోజకవర్గానికి రానున్నారు.