ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించడమే నా ప్రధాన ఎజెండా.. అందు కోసమే హుజురాబాద్, గజ్వేల్ లో పోటి చేస్తున్నాను తెలిపారు. కేసీఆర్ మధ్యం, డబ్బు సంచులను నమ్ముకున్నాడు.. హుజురాబాద్ లో ఎమ్మెల్యే ప్రోటో కాల్ విస్మరించారు అని ఆయన ఆరోపించారు.
యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది.. ఆ లక్ష్మీనరసింహుడే మనతో పని చేయించుకున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పోతాయ్ అని ఆనాడు అన్నారని, కరెంటు ఉండదు, చిమ్మ చీకట్లు అవుతాయన్నారని సీఎం గుర్తు చేశారు.
ఆనాడు గోదావరి జలాల కోసం పోరాటాలు చేసిన గడ్డ తుంగతుర్తి అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తుంగతుర్తి సస్యశ్యామలంగా మారింది... కారణం కాళేశ్వరమని సీఎం వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టు నీటిని కూడా త్వరలోనే అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.. ఏం చేశారు, భవిష్యత్‌లో ఏం చేస్తారు అని ఆలోచించాలని కోదాడలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. ఓటు మన చేతిలో బ్రహ్మాస్తమని, పంట పొలాలు ఎండాలా, పండాలా అనేది ఓటు నిర్ణయిస్తుందన్నారు.
బీసీలను కేటీఆర్ అవమానించారని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. బీసీలను ముఖ్యమంత్రి చేస్తామనగానే గుణం గుర్తుకొచ్చిందా అంటూ ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో ఎంతమంది గుణవంతులకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలి అంటూ ఆయన పేర్కొన్నారు. తక్షణమే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తారు. breaking news, latest news, telugu news, big news, cm kcr, brs, telangana elections 2023
వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ విజయభేరీ యాత్ర జరిగింది. అంబేడ్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రోడ్ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు కల్పించుకున్నాడని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న విజయభేరీ బస్సు యాత్ర నేడు వికరాబాద్ తాండురులో ప్రారంభమైంది. అయితే.. ఇవాళ ముఖ్య అతిథిగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, cm kcr, dk shiva kumar, congress, revanth reddy