Telangana Assembly Live: ఇవాళ ఉభయసభల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ జరగతుంది. శాసనభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్‌పై చర్చను ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ప్రారంభించారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పై చర్చ జరపనున్నారు. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు వెలిచాల జగపతిరావు, మందాడి సత్యనారాయణ రెడ్డి, గడ్డం రుద్రమదేవికి శాసనసభ సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరాలనికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను సోమవారం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ పై ఇవాళ శాసనసభ, శాసన మండలిలో చర్చ జరగనుంది. అనంతరం రెండు సభల్లో జరిగిన చర్చకు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సమాధానం ఇవ్వనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసిన నేరుగా బడ్జెట్‌పై చర్చ చేపట్టనున్నారు. కౌన్సిల్‌లో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై చర్చ చేపట్టారు.