Revanth Reddy : రాష్ట్రంలో పాలన చూస్తుంటే రజాకార్లు మళ్లీ వచ్చినట్లు ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ములుగులో నా వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారట.. రాజ్యాలను కూల్చి రాచరికాన్ని బొంద పెట్టిన చరిత్ర తెలంగాణదని, రాష్ట్రంలో పాలన చూస్తుంటే రజాకార్లు మళ్లీ వచ్చినట్లు ఉందన్నారు. ఎక్కడ దోపీడీలు, కబ్జాలు జరిగినా అక్కడ బీఆర్‌ఎస్ నేతలున్నారని, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఎందుకు నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు. ఇన్ని అక్రమాలకు పాల్పడిన కేసీఆర్ ను, ఆయన సామంత రాజు శంకర్ నాయక్ ను శంకరగిరి మాన్యాలకు తరిమే బాధ్యత మీపై ఉందని, కేసీఆర్ కాదు.. కింద పనిచేసే కుక్కలు వచ్చినా.. నెత్తి మీద కాలు పెట్టి తొక్కి.. పాతాళానికి పంపిస్తామన్నారు. ప్రగతి భవన్ లోపలికి పేదలకు ఎందుకు ప్రవేశం లేదని, అందుకే చెప్పా.. ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతామని, కేసీఆర్ గుర్తు పెట్టుకో బిడ్డా….కొత్త ఏడాదిలో ప్రగతి భవన్ గడీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : Brain Health: నోటి అపరిశుభ్రత మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.. తాజా అధ్యయనంలో వెల్లడి
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
దారిపొడవునా ఎవరిని కదిలించినా వారికి దుఃఖం పొంగుకొస్తోందని, బీఆర్‌ఎస్ ను వందమీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని ఆవేశంగా చెబుతున్నారన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే బాగుపడతామని మా ఆడబిడ్డలు చెప్పారని, ఆర్టీసీ కార్మికులు తమ గోడు వెళ్లబోసుకున్నారని, నీరంకుశ పాలనలో తమను వేధిస్తున్నారని ఆవేదనగా చెబుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీలో 6200 బస్సులుంటే 3200 బస్సులు ప్రైవేటువేనన్న రేవంత్ రెడ్డి.. 50వేల మంది చేసే పనిని 40వేల మందితో వెట్టి చాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు. ఒకటో తారీఖున వచ్చే జీతాలు.. 8 వ తేదీ వచ్చినా రాలేదని కంట తడి పెట్టారని, అవకాశం వచ్చిన రోజు కేసీఆర్ సర్కారుకు కర్రు కాల్చి వాత పెడతామని ఓ మహిళా కండక్టర్ ఆవేదనగా చెప్పిందని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : MLC Kavitha : పేద ప్రజల మీద ఆలోచన లేని మోదీ ప్రధానిగా అవసరమా
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!