Off The Record: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యారు. సిట్టింగ్ ఎంపీగానే ఉన్నప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఓపిగా ఉన్న ఆయన బీఆర్‌ఎస్‌ను వదిలేయాలని డిసైడ్ అయ్యారు. పొంగు లేటి వర్గాన్ని బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తోంది. దమ్ముంటే తనపై వేటు వేయాలని మాజీ ఎంపీ అధికారపార్టీని సవాల్ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఇల్లెందు, అశ్వారరావుపేట, వైరా అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే, పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. రోజుకో పార్టీ అని ప్రచారం చేస్తున్నారు. బీజేపీతో టచ్‌లో ఉన్నారని.. కాంగ్రెస్‌లోకి వెళ్తారని అనుకుంటున్నారు. ఇంతలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసింది. పొంగులేటి తమ పార్టీలోకి వస్తారని షర్మిల ప్రకటించారు.
Read Also: Off The Record: అధినేత దృష్టిలో పడేందుకే ప్రయారిటీ..! మంత్రిపై అధిష్టానికి ఫిర్యాదులు..
అదే సమయంలో విజయమ్మతో పొంగులేటి మాట్లాడుతున్న ఫొటో బయటకొచ్చింది. అయితే అది పాత ఫొటో. కొంతమంది ఉద్దేశ పూర్వకంగానే ఈ ఫొటోను బయటకు తీసుకొచ్చినట్టు ఆయన వర్గం చెబుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన YSRTPలోకి కానీ.. మరో రీజినల్ పార్టీలోకి కానీ ఆయన వెళ్లే పరిస్థితి. ఇది అందరికీ తెలిసినా.. పొంగులేటిని ఇరుకున పెట్టేందుకు కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పొంగులేటి మాత్రం జాతీయ పార్టీలోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీలోకి వెళ్తే ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఏంటనేది ఆయన మంతనాలు చేస్తున్నారు. బీజేపీ కూడా ఆయన పార్టీలోకి వస్తే లాభమేనేని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా పొంగులేటికి గాలం వేస్తోంది. పీసీసీ రేవంత్, సీఎల్పీ నేత భట్టి తదితరులు పొంగులేటి కాంగ్రెస్‌లోకి రావాలని ప్రకటనలు చేస్తున్నారు. త్వరలోనే పొంగులేటి ఏ జాతీయ పార్టీలో చేరతారో స్పష్టత ఇవ్వనున్నారు.