విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మనం గట్టిగా పోరాడినందుకే కేంద్రం వెనక్కి తగ్గిందని అన్నారు. మంత్రి కేటీఆర్ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది.
సింగరేణిని కొనలేని వారు విశాఖను కొంటారా? అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయం నెరవేరాలంటే రాజ్యాధికారం కావాలి, విగ్రహాలు కాదని అన్నారు.
Iftar Party : దేశం కోసం ప్రతి ఒక్కరూ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఎల్‌బీ స్టేడియంలో సర్కార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని కేసీఆర్ ప్రసంగించారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదంపై బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం సమీపంలో సిలిండర్లు పేలడంతో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడడం బాధాకరమన్నారు.
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన బీజేపీ కార్యక్రమం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఏం సంబంధం, ఎలా హాజరవుతారని ప్రశ్నించారు.
రంజాన్ మాసం ముస్లిములకు ప్రవిత్రమైన మాసం. రంజాన్ సందర్బంగా.. తెలంగాణ సర్కార్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.