KTR: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మనం గట్టిగా పోరాడినందుకే కేంద్రం వెనక్కి తగ్గిందని మంత్రి కేటీఆర్ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో తాము ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే వెల్లడించారు. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ ప్రకటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత్ రాష్ట్ర కమిటీ తొలి విజయం సాధించిందని కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పోరాటంతో కేంద్రం దిగివచ్చిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కాస్త వెనక్కి తగ్గిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లేది లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటించారు. ప్లాంట్‌ను పూర్తి స్థాయిలో పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఆర్‌ఐఎన్‌ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడిన ఘనత మన కేసీఆర్ అని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మనం గట్టిగా పోరాడినందుకే కేంద్రం వెనక్కి తగ్గిందని అన్నారు. కేసీఆర్ దెబ్బ అలా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read also: Perni Nani vs KTR: కేటీఆర్ కామెంట్లకు పేర్నినాని కౌంటర్.. హరీష్‌ది మహా తెలివైన బుర్ర..!
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే గురువారం ఉదయం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ముందుకు వెళ్లడం లేదని.. ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించడం లేదని, గతంలో ఆర్‌ఐఎన్‌ఎల్ ను బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. ప్లాంట్‌లో కొన్ని కొత్త డిపార్ట్‌మెంట్లను ప్రారంభిస్తున్నాం.. ప్లాంట్ పూర్తి స్థాయిలో పని చేసే ప్రక్రియలో ఉంది.ఆర్‌ఐఎన్‌ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తాం’’ అని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌పై ఆసక్తి చూపడంపై ఫగ్గన్ సింగ్ స్పందించారు. ప్రభుత్వ భాగస్వామ్యం ఒక ఎత్తుగడ మాత్రమేనని.. స్టీల్ ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని.. ప్లాంట్‌ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని.. ముడిసరుకు పెంచే ప్రక్రియపై దృష్టి సారించామని వివరించారు.
125 అడుగులు అంబేడ్కర్ రాజసం.. ప్రత్యేకతలేంటో తెలుసా?