Iftar Party : దేశం కోసం ప్రతి ఒక్కరూ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఎల్‌బీ స్టేడియంలో సర్కార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేళ్ల కిందట తెలంగాణ అంటే వెనుకబడింది అనేవారు. ఇప్పుడు అభివృద్ధిలో దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం లేదన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు పదేళ్లలో కాంగ్రెస్ ఖర్చు చేసింది కేవలం రూ. 1200 కోట్లు మాత్రమే.
Read Also: Wealth of CMs: 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే.. టాప్‌లో జగన్ మోహన్ రెడ్డి
కానీ తెలంగాణ సర్కార్ మైనార్టీల కోసం గత తొమ్మిదేళ్లలో రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం అని తెలిపారు. మనం అభివృద్ధి చెందుతున్నంతగా మిగతా రాష్ట్రాల్లో అభివృద్ధి లేదు. తాగు, సాగు నీరు, కరెంట్ సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి ఘనస్వాగతం లభించింది. దేశం కూడా మనలాగే అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఇఫ్తార్ విందులో మంత్రులు మహముద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సానియా మీర్జా, ముస్లిం మతపెద్దలతో పాటు 13 వేల మంది ముస్లింలు పాల్గొన్నారు. ముస్లిం చిన్నారులకు కేసీఆర్ రంజాన్ కానుకలు అందించారు. సీఎం కేసీఆర్ నిఖత్ జరీన్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.