జగన్ కోసం, వైసీపీ కోసం ప్రజాస్వామ్యం లేదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ఎంపీ కుటుంబాన్ని రౌడీషీటర్లు కిడ్నాప్ చేయడానికి సిరిపురంలో ఉన్న భూముల వ్యవహారమే కారణం అని ఆయన ఆరోపించారు.
పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను సీఎం జగన్ ప్రకటించినప్పటి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారు అని మంత్రి రోజా ఆరోపించారు. వైజాగ్ ను క్రైం సీటిగా పవన్, చంద్రబాబు చిత్రీకరిస్తున్నారు.. రిషికోండకు బోడిగుండు కోట్టించారంటూ బోడి యదవలందరూ బోడి ప్రచారం చేస్తున్నారు అని ఆమె విమర్శించారు.
ప్రభుత్వం వారం వారం సమీక్షల మీద ఉన్న శ్రద్ధ.. ఉద్యోగులకు నిధులు, కనీస సౌకర్యాలు కల్పించడంపై ఉంటే బాగుండేది అని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం అన్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ( శుక్రవారం ) ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి- అమలాపురం మండలం జనుపల్లి బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం లబ్దిదారులకు నిధులను విడుదల చేయనున్నారు.
Posani Krishna Murali: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా నటించిన చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుపోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కేంద్ర సహకార బ్యాంకులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పీఏసీఎస్‌లు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌ల బలోపేతంపై చర్చించారు. వాటి నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం దిశగా సీఎం జగన్ చర్చించారు.
టీటీడీ చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇవాళ ఉదయం 11.44 గంటలకు గరుడాళ్వార్ సన్నిధిలో టీడీడీ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు.
Top Headlines @5PM 08.08.2023. Breaking news, latest news, telugu news, big news, Top Headlines @5PM, top news, cm jagan, cm kcr, harish rao, minister ktr,