ప్రజా గాయకుడు గద్దర్ మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా కవి - గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అని సీఎం జగన్ కొనియాడారు. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే అని అన్నారు.
రేపటి నుంచి సీఎం జగన్ వరద ప్రభావిత, ముంపు మండలాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు సీఎం పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు.
యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఖాళీల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. breaking news, latest news, telugu news, big news, cm jagan,
రేపు సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా రేపు సీఎం జగన్ వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. ఉదయం 10.55 గంటలకు ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.15 గంటలకు కైలాసపురం పోర్టు ఆసుపత్రి వద్దకు చేరుకుంటారు. breaking news, latest news, telugu news, cm jagan, big news,