మహాత్మా గాంధీ మార్గంలోనే నడుస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నేడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు ఆర్పించారు. ఈ తరుణంలోనే.. మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు ట్విట్టర్ వేదికగా చెప్పారు. మహాత్మా గాంధీ గారి మాటలను ఆదర్శంగా తీసుకుని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నామన్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామ /వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశామని సీఎం జగన్ చెప్పారు. మునుముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
మహాత్మా గాంధీ గారి మాటలు ఆదర్శంగా…రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాం. మునుముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తాం. నేడు మహాత్మా గాంధీ గారి జయంతి సంద… pic.twitter.com/9fEwN6KFf4
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2023