సీఎం వైఎస్ జగన్ ఈ నెల 29న విజయవాడలో పర్యటించనున్నారు. విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్‌లో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళ్తారు. బహిరంగ సభలో ప్రసంగించి తాడేపల్లికి చేరుకుంటారు సీఎం జగన్. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆటో, క్యాబ్ లు నడుపుతూ జీవనం సాగించే వారికి వైఎస్సార్ వాహన మిత్ర ప్రథకం ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.
Also Read : Wood Apple : వెలగపండుతో వెయ్యి లాభాలు.. ఆ సమస్యలు పరార్..
2019 నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ సాయాన్ని లబ్ధిదారులకు అందజేసింది. ఇప్పుడు ఐదో విడత సాయాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 29న కాకినాడలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 10 వేలు జమచేయనున్నారు. ఈనెల 29 జరిగే ఈ కార్యక్రమం ఏర్పాట్లను కలెక్టర్ శ్రుతి శుక్లా పరిశీలించారు. ఇతర ఉన్నతాధికారులు కూడా హెలి ప్యాడ్, బహిరంగ సభ జరిగే ప్రదేశాల్లో ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. ఇంకా 6 రోజులే సమయం ఉండే ఉండటంతో ఎలాంటి లోటు పాటు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలి రావాలని ఆ పార్టీ నాయకులు సూచించారు.
Also Read : Crocodile in Khairatabad: ఖైరతాబాద్ నాలాలో మొసలి.. భయాందోళనలో స్థానికులు