ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ విద్యార్థులకు అందుబాటులోకి ఐబీ సిలబస్ ను తీసుకొచ్చింది. అంతర్జాతీయంగా ప్రభుత్వ బడి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు.
ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 23 విజయదశమి నుంచి విశాఖపట్నం నుంచే సీఎం జగన్ పాలన చేస్తారు అని పేర్కొన్నారు. ఏర్పాట్ల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు అని అమర్నాథ్ వెల్లడించారు.
Gratuity to Annavaram Temple Retired Vrata Priests; ‘వినాయచవితి’ పండగపూట అన్నవరం సత్యదేవుని సన్నిధిలో సేవలందించిన 33 మంది విశ్రాంత వ్రత పురోహితులకు వైఎస్ జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. గతంలో ఇద్దరు విశ్రాంత పురోహితులకు చెల్లించినట్టుగానే.. ఈ 33 మందికి వారి సర్వీసును అనుసరించి ఏడాదికి రూ. 10 వేల చొప్పున గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో వీరు గరిష్టంగా రూ. 4.5 లక్షలు, కనిష్టంగా రూ. 1.5 లక్షల…
AP CM Jagan Schedule Today: సోమవారం నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7-8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజు సాయంసంధ్యా సమయంలో శ్రీవారి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని…
చంద్రబాబు తెలుగు ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్.. ఈ ప్రాంతం కోసం చంద్రబాబు చేసిన కృషిని ఎవ్వరూ మరిచిపోకూడదు.. రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగింది.. పవన్ వస్తానంటే విమానం ఎక్కడానికి కూడా అనుమతి లభించని పరిస్థితి.. ఫ్లైట్ ఆపేయడం ఏంటంటూ ఆశ్చర్యపోయామని నాదేండ్ల మనోహార్ అన్నారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించింది బీజేపీ ప్రభుత్వమే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా నారాయణగూడ వైఎంసీఏ సిగ్నల్ దగ్గర షోయబుల్లాఖాన్ చిత్ర పటానికి నారాయణ ఘన నివాళులు అర్పించారు.
సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని శాంతి భద్రతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత పది రోజులుగా జరిగిన పరిణామాలను సీఎం జగన్ కు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సహా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు వివరించారు.
పది రోజులు లండన్ టూర్ ముగించుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సీఎం జగన్ కు మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, డీజీపీ, సీఎస్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ముద్దాయి అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నాకు ఏమీ లేదు అని చెప్పే చంద్రబాబు కోట్ల రూపాయలు వెచ్చించి ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పించుకున్నారు.. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మీద కేసు నమోదు చేస్తే అక్రమ కేసు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి వ్యాఖ్యానించడం సరికాదు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. లండన్ నుంచే చంద్రబాబు అరెస్టును సీఎం జగన్ మానిటరింగ్ చేస్తున్నాడు అని ఆయన అన్నారు.