రుషికొండలో రాజమహల్ నిర్మించుకొంటూ క్లాస్ వార్ అంటారా?.. అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పేదవాడికి సెంటు భూమే.. ముఖ్యమంత్రి నివాసానికి 9 ఎకరాలు.. రూ.451 కోట్లు ఖర్చు చేస్తారా?.. సీఎం పచ్చదనం చూసేందుకు ప్రహరీ నిర్మించి గడ్డి పెంచడానికి.. రూ 21 కోట్లు నిధులా? అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై రేపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం. ఈ సమావేశానికి ఏపీ నుంచి అధికారులు హాజరుకానున్నారు.
కోర్టు వ్యాఖ్యానాలు చూస్తే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చేయని తప్పుకు 50 రోజులు చంద్రబాబు జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఈ తీర్పులో కోర్టు చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది అని పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు.
ఏపీలో రేపటి నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన స్టార్ట్ చేయనున్నారు. 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో మొదలు కానుంది.
సీఎం జగన్ పై టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ పై ప్రజలకు నమ్మకం లేదని ఆయన ఆరోపించారు. అందుకే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారని విమర్శించారు.
సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా.. ఈరోజు ఉదయం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో రూ.1.75 కోట్లతో నిర్మించిన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్, రూ.2.75 కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్షలతోనే మా పార్టీ మ్యానిఫెస్టో రూపొందింది అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నాలుగున్నర ఏళ్ళల్లో మా ప్రభుత్వం ఏం చేసిందో అందరి.. కోటి 40 లక్షల కుటుంబాలకు నేరుగా ప్రయోజనం పొందారు.