చంద్రబాబుకు వచ్చింది బెయిలే.. నిర్దోషి అనే తీర్పు కాదు.. రెచ్చిపోతే..!
ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల పాటు అనారోగ్యం కారణంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక, ఇదే కేసులో భాగంగా ఇవాళ ఏపీ హైకోర్టు మరో విచారణ చేసింది. ఈ మేరకు కీలక తీర్పును వెల్లడించింది. రెగ్యులర్ గా చంద్రబాబు నాయుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇక, ఈ మొత్తం వ్యవహారంపై ఇవాళ ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు వచ్చింది బెయిల్ మాత్రమే.. ఆయనను నిర్ధోషి అని ప్రకటించలేదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కోర్టు ఇచ్చిన తీర్పును శిరసా వహించాల్సిన టీడీపీ నేతలు తమ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై, పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. అయితే, చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఐడీ అధికారులు ఇప్పటికే 8 కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఏపీ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి మాత్రమే హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. కానీ, ఇదే కేసుకు సంబంధించి హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు.
బీసీలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మోసం చేశాయి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. బీసీలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మోసం చేశాయి..బీజేపీ ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఒకసారి దీపావళి జరుపుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. డిసంబర్ 3న బీజేపీ అధికారంలోకి వచ్చాక మరోసారి దీపావళి చేసుకుందామని అమిత్ షా అన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభమయ్యాక మూడోసారి దీపావళి చేసుకుందామని, బీజేపీ అధికారంలోకి అయోధ్యలో ఉచిత దర్శనం చేయిస్తామన్నారు అమిత్‌షా.
అంతేకాకుండా..’పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ మాతో పోరాడారు.. దీనితో ప్రధాని ఇక్కడికే వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పడటంతో తెలంగాణ రైతుల ఆకాంక్షలు నెరవేరాయి… బీజేపీ అధికారంలోకి వస్తే మూతపడిన మూడు చక్కెర పరిశ్రమలను తెరిపిస్తాం… నిజామాబాద్‌లో 500 పడకలతో బీడీ కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మాణం చేపడతాం. కేసీఆర్ అమలు చేస్తున్న 4శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. ఉపాధి కోసం వలసవెళ్లిన వారి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అరవింద్ పోరాడుతున్నారు..తప్పకుండా ఏర్పాటు చేస్తాం… తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఓవైసీ భయపడి చేయడం లేదు… కుటుంబ పార్టీలు దేశానికి సమాజానికి చేటు చేస్తాయనే విషయాన్నిమీరు గమనించాలి… కారు స్టీరింగ్,కేసీఆర్,కవిత,కేటీఆర్ వద్ద కాదు..ఓవైసీ చేతిలో ఉంది.. ధర్మపురిని గెలిపించి అతనికి గొప్పపదవి ఇచ్చే అవకాశం కల్పిస్తారా… బీజేపీ అభ్యర్థులందరిని గెలిపిస్తారా.. డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తారా లేదా..అందరు చేతులెత్తి సమాధానం చెప్పండి…’ అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.
మైనర్ బాలిక ఆచూకీ లభ్యం.. 5 రోజులు, 200 సీసీ కెమెరాలు వడపోసిన హెడ్ కానిస్టేబుల్
ఐదు రోజుల తర్వాత జూబ్లీహిల్స్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. హెడ్‌కానిస్టేబుల్ నాగేశ్వరరావు కష్టం వల్లే బాలిక జాడ లభ్యమైంది. ఇటీవల తన 15 సంవత్సరాల కూతురు కనిపించడం లేదంటూ బాలిక తండ్రి ఐదు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తండ్రితో కలిసి నివసిస్తున్న మైనర్ బాలిక యూసఫ్ గూడలోని స్థానిక పాఠశాలలలో 10వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో 5 నెలల క్రితం బాలిక తల్లి చనిపోవడంతో ఒంటరైన ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లింది. స్కూల్‌కు సరిగ వెళ్లకపోవడంతో ఆమెను సోదరుడు మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక నవంబర్ 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
అహ్మదాబాద్లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో టీమిండియా ఆస్ట్రేలియాపై చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్ల విజృంభణతో భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులే చేశారు. అయితే ఇంతటి దారుణ పరాజయాన్ని ఎవరూ ఊహించలేదు. వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఓటమి లేకుండా ఆడిన భారత్.. ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయి టీమిండియా అభిమానుల ఆశలను నిరాశ చేసింది. కాగా.. నిన్న వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బ్యాటింగ్ చూస్తుంటే.. తగిన మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్నప్పుడు సహజంగానే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుందని, ఇప్పుడదే టీమిండియా కొంపముంచేలా ఉందని వ్యాఖ్యానించాడు.
బీఆర్ఎస్ నేతలారా.. బిస్తర్ సర్దుకోవాల్సిందే…
కేటీఆర్ సీఎం అయితే…. హరీష్ ఔట్ అని, బీఆర్ఎస్ నేతలారా.. బిస్తర్ సర్దుకోవాల్సిందేనన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఇవాళ ఆదిలాబాద్ లో బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్… ఇకపై ఉద్యోగుల సంగతి చూస్తాడట.. ఇల్లులేని పేదలందరినీ తెలంగాణ నుండి తరిమేస్తాడేమో అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ … నిజమైన హిందువైతే ఒవైసీకి బొట్టుపెట్టి హనుమాన్ చాలీసా చదివించు అని ఆయన సవాల్ విసిరారు. మున్నూరుకాపులను మోసం చేసిన వ్యక్తి జోగు రామన్న అని బండి సంజయ్ ఆరోపించారు. బీసీలంతా బీజేపీవైపు చూస్తున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే రామరాజ్యం స్థాపిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సాత్నాల ప్రాజెక్ట్‌పై చెక్ డ్యామ్‌లను నిర్మించడంలో కూడా విఫలమైందన్నారు.
తెలంగాణలో మోదీ పర్యటన.. షెడ్యూల్ ప్రకటించిన గుజ్జుల
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నిర్మల సీతారామన్, దేవేంద్ర ఫడ్నవిస్‌లు ఇక్కడి బీజేపీ అభ్యర్థులకు మద్ధతుగా ఒక్కొక్కొ రోజు ప్రచారం చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వారి షెడ్యూల్‌ను ప్రకటించారు. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రధాని మోదీతో సహా పార్టీ అగ్ర నేతలు తెలంగాణలో ఉదృతంగా పర్యటిస్తారని తెలిపారు. పర్యటనలో భాగంగా 25, 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ మూడు రోజుల పాటు తెలంగాణలో ఉండనున్నట్టు వెల్లడించారు.
చంద్రబాబు దొరికిన కాడికి దోచుకున్నారు..
శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. చిలకపాలేంలో ఎన్ఏసీఎల్ నాగార్జున కెమికల్స్ ఫ్యాక్టరీ విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతుందన్నారు. ఆ కాలుష్యం భూమిలోకి పోతుంది.. పోందురు మండలంలోని జల వనరులన్నీ కలుషితమై పోతున్నాయన్నారు. ఆయా గ్రామాల్లో పిల్లలు అంగవైకల్యంతో పుడుతూ.. క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆయన వ్యాఖ్యనించారు. ఫ్యాక్టరీతో గాలి కూడా కాలుష్యం అవుతోంది.. మా ఊళ్లో మా ఇంటి దగ్గరకు కూడా గాలి కాలుష్యంతో దూలి వస్తుందన్నారు. కాలుష్యం బారిన పడకుండా గ్రామాల వారికి మంచి నీటిని ఇవ్వాలని నిర్ణయించాం.. నాగావళి నది నుండి గండ్రేడు దగ్గర పంప్ హౌస్ పెట్టి.. 2లక్షల నీటిని పంప్ చేయనున్నామని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు.
ఓటమి బాధలో టీమిండియా ఆటగాళ్లు.. డ్రెసింగ్ రూమ్కు వెళ్లి ఓదార్చిన ప్రధాని
స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ కావున.. ఇటు అభిమానులతో పాటు, అటు ఆటగాళ్లకు కప్ కొట్టాలనే ఆశ ఉండేది. కానీ నిన్న జరిగిన ఘోర పరాజయంతో అభిమానులు, ఆటగాళ్ల ఆశలు నిరాశలయ్యాయి. ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్ ల్లో గెలిచిన టీమిండియా.. చివరకు ఫైనల్స్ లో ఓడి చెప్పుకోలేని బాధతో తీవ్ర ఆవేదన చెందారు.
ఈ క్రమంలో.. అహ్మదాబాద్ లో నిన్న మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూంలో సీరియస్ వాతావరణం నెలకొంది. పైకి నవ్వుతూ కనిపించిన ఆటగాళ్ల ముఖాలు.. లోపల మాత్రం గుండెల్లో చెప్పుకోలేనంత బాధ ఉంది. ఈ సమయంలో ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లారు. ఆటగాళ్లను ఓదార్చిందుకే ప్రయత్నించారు. అప్పటికే తీవ్ర విచారణలో ఉన్న మహమ్మద్ షమీని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. అంతేకాకుండా.. వీపుపై చేయి వేసి వాత్సల్యంతో నిమురుతూ షమీని కాస్త నిమ్మలం చేశారు.
నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి పరకాల
పరకాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి పరకాల అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ పుట్టిన గడ్డ అని, అలాంటి ఈ గడ్డను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసే బాధ్యత మాది అని ఆయన హామీ ఇచ్చారు. మచ్చలేని , అవినీతి మరక లేని నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అని, కేసీఆర్ మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపడుతుండు అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దొరల రాజ్యం కావాలా? ఇందిరమ్మ రాజ్యం కావాలా పరకాల ప్రజలు తేల్చుకోవాలన్నారు రేవంత్ రెడ్డి.
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాద ఘటన.. మత్స్యకారులకు ఏపీ సర్కార్ భారీ సహాయం
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం కారణంగా బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహాయం ప్రకటించారు. దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం మేర పరిహారంగా అందించాలని ఆదేశించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై ఈ ఉదయం జరిగిన సమావేశంలో సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు.
కాగా, ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు సహా జిల్లా కలెక్టర్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు పూర్తి భరోసానిచ్చామని వివరించారు. ప్రమాదంలో 36 బోట్లు దగ్ధం కాగా, మరో 9 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మట్లాడుతూ.. ప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం మత్స్యకారుల జీవితాలకే పెద్ద దెబ్బ అని.. ఇలాంటి పరిస్థితుల్లో వారి జీవితాలను నిలబెటాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. సహాయం విషయంలో అత్యంత మానవతాధృక్ఫధంతో వ్యవహరించాలన్నారు. మానవత్వం అనే పదానికి అర్ధం చెబుతూ.. మత్స్యకారుల జీవితాలను తిరిగి నిలబెట్టేలా ఈ సాయం ఉండాలని సీఎం చెప్పారు. అందుకే ఈ విషయంలో ఉదారంగా ఉండాలని ఆదేశించారు.
ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది
నల్లగొండ జిల్లా నకిరేకల్ నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఆయన ఆరోపించారు. అనేక మంది బలిదానాల తరువాత తెలంగాణ వచ్చిందని, ప్రభుత్వానికి నష్టం వచ్చినా ధాన్యం కొనుగోలు ఆపలేదన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ ధరణి స్థానంలో కాంగ్రెస్ భూమాత తీస్తుందట, అది భూమాత నా…. భుమేత నా.. అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో కరువు కాటకాలు.. ఎమర్జెన్సీ తప్ప ఏమీ లేవని, ఇందిరమ్మ రాజ్యం వైఫల్యం వల్లే ఎన్టీఆర్ వచ్చారు.. ఎన్టీఆర్ సంక్షేమం, అభివృద్ధి ప్రారంభమైందన్నారు.
రుషికొండలో రాజమహల్ నిర్మించుకుంటూ క్లాస్ వార్ అంటారా?
రుషికొండలో రాజమహల్ నిర్మించుకొంటూ క్లాస్ వార్ అంటారా?.. అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పేదవాడికి సెంటు భూమే.. ముఖ్యమంత్రి నివాసానికి 9 ఎకరాలు.. రూ.451 కోట్లు ఖర్చు చేస్తారా?.. సీఎం పచ్చదనం చూసేందుకు ప్రహరీ నిర్మించి గడ్డి పెంచడానికి.. రూ 21 కోట్లు నిధులా? అని ఆయన ప్రశ్నించారు. పేదల ఇళ్ల కాలనీల్లో కనీస సదుపాయాలు.. మౌలిక వసతులు లేవు.. ఇప్పుడు చెప్పండి ఎవరు పెత్తందారు?.. ప్రపంచంలో ఏ ప్రభుత్వ అధినేతా ఈ విధంగా వ్యవహరించలేదు?.. ఒబెరాయ్ గ్రూపు గండికోటలో ఏడు నక్షత్రాల హోటల్ నిర్మించడానికి రూ. 350 కోట్లు ఖర్చు అంటూ డీపీఆర్ ఇస్తే.. సీఎం క్యాంపు ఆఫీస్ కు మాత్రం రూ. 451.67 కోట్ల ఖర్చు చేశారు అని నాదేండ్ల మనోహార్ అన్నారు.