ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ తో పంట నష్టపోయిన రైతాంగాన్నివెంటనే ఆదుకోవాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కోరారు. రైతులకు ఉదారంగా ఆర్ధిక సహకారం అందించాలి అని ఆమె తెలిపారు.
మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం చిత్తశుద్దితో పని చేస్తుంది అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విపత్కర పరిస్దితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం.. ప్రతీ రెండు గంటలకు అప్ డేట్స్ తీసుకుని తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ నెల 7వ తారీఖున జగనన్న విద్యా దీవెన డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కర్నూలు పర్యటనలోనే జగనన్న విద్యా దీవెన డబ్బులను సీఎం జగన్ రిలీజ్ చేయనున్నారు.
కరువు ప్రాంతాలుగా ముద్ర వేసుకున్న రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని వసతి కల్పించి దుర్భిక్షంలో ఉన్న ప్రాంతాలను సుభిక్షం చెయ్యాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి సంకల్పించుకున్నారు.
రేపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాల, కడప జిల్లాల పర్యటించనునున్నారు. నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో ఆయన పాల్గొననున్నారు.
మచిలీపట్నంలో వైసీపీ సామాజిక సాధికార యాత్రలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలను గుండెల్లో పెట్టుకుని చూస్తానని సీఎం జగన్ చెప్పారన్నారు. చెప్పిన మాట ప్రకారం ప్రతీ పదవుల్లో 50 శాతం ఛాన్స్ ఇచ్చారు.. 40 ఏళ్లుగా టీడీపీ నేతల గుండెల్లో బీసీలమైన మేము జీరోలుగా ఉన్నాం.. మీ దృష్టిల్లో సున్నాలమైన మమ్మల్ని సీఎం జగన్ లీడర్లను, మంత్రులను చేశారు.
నిన్న మొన్నటి దాక సెంట్రల్ జైల్ లో ఉండి ఆరోగ్యం బాగా లేదనే సాకుతో బయటకు వచ్చి మమ్మల్ని ఓడిస్తాడా.. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కాదు చంద్రసేన.. చంద్రబాబు టికెట్లు వేస్తే ఫ్లైట్ ఎక్కేది పవన్ కళ్యాణ్.. నారా లోకేశ్ పాదయాత్ర చేసినా దూకుడు యాత్ర చేసిన ఎప్పటికీ నాయకుడు కాలేడు అంటూ అంబటి రాంబాబు విమర్శించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతాయన్నారు. మరి పార్లమెంట్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారో.. అనేది తెలియదని చెప్పారు. అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారత సాధించడమే సీఎం జగన్ లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో 400 మండలాలకు పైగా కరువు విలయ తాండవం చేస్తుంటే.. కేవలం100 మండలాలు మాత్రమే కరువు ఉందని చెప్పడం మోసపూరితం అన్నారు. కరువు మీద వాతావరణ శాఖ హెచ్చరించినా.. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం రైతాంగం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కున్న అగౌరవ భావం, చిన్నచూపు కాదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు.
రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూళ్లూరుపేట, తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వాకాడు మండలం రాయదరువు దగ్గర ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంఖుస్థాపన చేయనున్నారు.