బద్వేల్ బై ఎలక్షన్ పై సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. కాసేపట్లో బద్వేల్ ఉప ఎన్నిక కసరత్తు సమావేశం కానుంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కడప జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు సీఎం జగన్. ఎన్నికకు సంబంధించి నేతలకు బాధ్యతలు అప్పగించటం, అనుసరించాల్సిన వ్యూహాల పై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఈ సమావేశం కోసం క్యాంపు కార్యాలయానికి బద్వేల్ వైసీపీ అభ్యర్థి దాసరి సుధ, మంత్రి పెద్దిరెడ్డి, కొడాలి నాని, డిప్యూటీ సిఎం అంజాద్ బాష, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్పీ మిథున్ రెడ్డి సజ్జల, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. అయితే ఈరోజే అభ్యర్థిని కూడా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.