ఏపీ సీఎం జగన్ ఒడిశా టూర్ సక్సెస్ అయిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్ ఒడిస్సా టూర్ సక్సెస్ అయిందా..? ఆ రాష్ట్ర సీఎంతో ఏపీ ముఖ్యమంత్రి జరిపిన చర్చలు సఫలమయ్యాయా..? ఎన్నో దశాబ్ధాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఓ కొలిక్కివచ్చినట్టేనా..? అసలు ఏపీ సీఎం జగన్.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ల మధ్య ఏ విషయాలు చర్చకువచ్చాయి..?
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సమావేశం సుదీర్ఘంగా సాగింది.
ఒడిషా సచివాలయంలో జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో ప్రధానంగా మూడు అంశాలు చర్చకు వచ్చాయి. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కమిటీ ఏర్పాటు చేయాలని అంగీకారానికి వచ్చారు. ముఖ్యంగా ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో సానుకూలంగా చర్చ జరిగింది. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్‌తో చర్చించారు.
Also Read
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
వీటితో పాటు పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్య, బహుదానది నీటి విడుదల, కోఠియా గ్రామాల గురించి మాట్లాడుకున్నారు. అంతేకాదు ఇంధన రంగంలో బలిమెల, ఎగువ సీలేరు కోసం ఎన్‌వోసీ, యూనివర్శిటీల్లో ఒడిషా, తెలుగు భాషాభివృద్ధికి కలిసి పనిచేయాలని నిర్ణయించారు. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, గంజాయి సాగు, రవాణా నివారణపైనా సహకారం కొనసాగించడంతో పాటు కలిసికట్టుగా ఎదుర్కోవాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించాయి. సరిహద్దు జిల్లాల్లో ఒడిశాలో తెలుగు, ఆంధ్రలో ఒడియాకు సంబంధించి లాంగ్వేజ్ టీచర్ల నియామకం, పాఠ్యపుస్తకాల పంపిణీ, పరీక్షల నిర్వహణకు స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాదు శ్రీకాకుళంజిల్లాలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, బరంపురం యూనివర్శిటీల ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. రెండు రాష్ట్రాల విశాల ప్రయోజానాల ధ్యేయంగా సమావేశం సాగిందని సీఎం జగన్ .. ట్వీట్ చేశారు. త్వరలో ఈ చర్చలు సత్ఫలితాలు ఇస్తాయని విశ్వసిస్తున్నానన్నారు.
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!