విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై సీఎం జగన్ బుధవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2021–22 నుంచి 2022–23, 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో నూతన విద్యా విధానం మూడు దశలుగా పూర్తిగా అమలు కానున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు. దీనిలో భాగంగా 25,396 ప్రైమరీ పాఠశాలలను యూపీ(అప్పర్ ప్రైమరీ) స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రానున్న విద్యా సంవత్సరంలో టీచర్ల సంఖ్యను…
వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేగా పథకాన్ని ఏపీలో సరిగా అమలు చేయలేకపోతున్నామని… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిమెంట్ సరఫరా సరిగా లేదని తెలిపారు. బయట మార్కెట్‍లో సిమెంట్ ధరలు మండిపోతున్నాయని…. పరువుకు పోయి పనులు చేపట్టిన వారు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారని పేర్కొన్నారు ధర్మాన. ప్రభుత్వ పనులు చేస్తున్న వారు నష్టపోతున్నారని… ఈ లోపాలను సరిచేసుకోవాలని కోరారు. మెప్పు కోసం తప్పుడు సలహాలు ప్రభుత్వ పెద్దలకు ఇవ్వొద్దని సూచనలు…
తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేందర్, బొత్స సత్యనారాయణ, గౌతం రెడ్డి, కృష్ణదాస్, బాలినేని, కన్న బాబులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5 పరిశ్రమలకు ఎస్‌ఐపీబీ గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. అయితే రూ.2,134 కోట్లతో 5 పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 7,683 మంది…
తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహకారం అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన గులాబ్ సైక్లోన్ చాలా భీభస్తమ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సైక్లోన్ వల్ల 34,586 మంది రైతులు పంట నష్టపోయారు. అయితే ఆ రైతుల ఖాతాల్లోకి 22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం అందించనుంది జగన్ సర్కార్. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ క్రాప్ ఆధారంగా…
వైసీపీలో అంతా తానై సజ్జలే నడిపిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ .. సజ్జలపై సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల మరో సారి ప్రెస్‌మీట్ పెడితే హైకోర్టుకు వెళ్తామన్నారు. ప్రభుత్వంలో పిల్లి ఈనినా.. కుక్క అరిచినా సజ్జలే సమాధానం చెబుతున్నా రన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న రోజుల్లో జగన్ బెంగళూరులో ఉన్నప్పుడు ఆయ నతోనే కలిసి సజ్జలే ఉండేవారని ఆయన అన్నారు. ఒకే కంచం.. ఒకే…
రహదారుల మరమ్మత్తులు, పునరుద్ధరణ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అధికారులకు కీలక సూచ నలు చేశారు. రాష్ర్టంలో రహదారుల మరమ్మత్తులు ఒక డ్రైవ్‌లా చేప ట్టాలని సూచించారు. రాష్ట్రంలో రహదారుల పై ఉన్న గుంతలు తక్ష ణమే పూడ్చాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తులపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం కోరారు.…
ఏపీలో ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వ స్కూళ్లలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘అప్పుడు అమ్మ ఒడి… ఇప్పుడు అమ్మకానికో బడి’ అంటూ ఆదివారం విమర్శలు చేసిన పవన్.. సోమవారం కూడా ట్విట్టర్ వేదికగా వైసీసీని ఉద్దేశిస్తూ ఓ పోస్టు చేశారు. కర్ణాటక మంగుళూరు ప్రాంతంలో హరికేళ హజబ్బ అనే పండ్ల వ్యాపారి అందరికీ స్ఫూర్తిదాయకమని పవన్ ప్రశంసించారు. Read Also: డేవిడ్ వార్నర్‌పై…
ఏపీ రాజధానికి సంబంధించిన కేసులపై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది . సీఆర్డీ యే రద్దు చట్టం , పాలనా వికేంద్రణ లపై దాఖలైన పిటీషన్లపై త్రిసభ్య ధర్మాసనం రోజువారీ విచారణ కొనసాగించనుంది. ప్రస్తుతం 90కి పైగా పిటీషన్లు దాఖలు చేశారు . ఈ ఏడాది ఆగస్టులో విచారణ జరిపిన ధర్మాసనం నేటికి వాయిదా వేసింది. రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టంపై దాఖలైన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రైతులు, నేతలు…
సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు.అప్పుడు అమ్మ ఒడి… ఇప్పుడు అమ్మకానికో బడిలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుం దన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. ఎయిడెడ్ స్కూళ్ల విలీన నిర్ణయంతో విద్యార్థులే బలి పశువులుగా మారారని పవన్ ఆరోపించారు. విద్యార్థుల విషయంలో వారి భవిష్య త్తును నాశనం చేస్తూ ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. వీటిలో ఎన్ని…
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ఆదివారం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సహా లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు సీఎం జగన్. సమావేశంలో విలువైన సమాచారాన్ని, తగిన సూచనలు, సలహాలు అందించిన కర్ణాటక…