3 రాజధానుల అంశం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో మూడు రాజధానులు చేస్తామంటూ జగన్ సర్కార్ ప్రకటించడంతో పాటు అసెంబ్లీలో చట్టం చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరుపున హజరైన అడ్వకేట్ జనరల్ 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటునట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ పరిణామాల్లో మార్పు చోటు చేసుకుంది.
దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. 3 రాజధానులు రద్దు చేస్తే స్వాగతిస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక స్టాండ్ తీసుకుందని.. అందుకే అమరావతి రైతుల వెంట ఏపీ బీజేపీ నేతలు పాదయాత్రలో పాల్గొన్నరన్నారు. ఇదిలా ఉంటే.. 3 రాజధానుల బిల్లును పూర్తిగా ఉపసంహరించుకుంటారా..? లేక కొన్ని మార్పులతో మరోసారి 3 రాజధానుల చట్టాన్ని ప్రవేశపెడుతారా..? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.