రాయల చెరువు గండిపై ఏపీ సీఎం జగన్ ఆరా తీశారు. సీఎంకు చెరువు పరిస్దితిని వివరించారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ ఘటన స్దానంలో పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించిన సీఎం… అత్యవసర సమయంలో ప్రజలను కాపాడటానికి రంగంలోకి మూడు హెలికాప్టర్స్ ను దించారు. ప్రజలు ప్రాణాలకు హానీ కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు జగన్.
అయితే తిరుపతి, చంద్రగరిని వణికిస్తున్న రాయల్ చెరువు సమీపంలో… మరోసారి వర్షపు చినుకులు పడుతుండటంతో ఆందోళనలో స్దానికులు…అధికారులు ఉన్నారు. వర్షం పడకూడదంటూ దేవుడికి పూజలు చేస్తున్నారు స్దానికులు. యద్ద ప్రతిపాదికన ఇసుక బస్తాలు వేస్తున్న వైనం. చెన్నై ఐఐటి నుండి ప్రత్యేక బృందాన్ని పిలిపిస్తున్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి.