మూడు రాజధానులపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు రాజధానులపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం జగన్ అసెంబ్లీ ప్రకటన చేశారు. కొన్ని మార్పులతో మళ్లీ తీసుకువస్తామని చెప్పారు సీఎం జగన్. అసలు అసెంబ్లీ లో సీఎం జగన్ ఏం మాట్లాడారంటే… 1953 నుంచి 1956 వరకు ఆంధ్రరాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. ఆరోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేదన్నారు. ఆ తర్వాత 1956లో కర్నూలు నుంచి రాజధానిని కానీ, గుంటూరు నుంచి హైకోర్టును హైదరాబాద్‌కు ఏ రకంగా తీసుకుని పోయారు, తీసుకుని పోయేటప్పుడు ఈ మాదిరిగా జరిగింది కాబట్టి అక్కడ ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని శ్రీబాగ్ ఒడంబిక, అవన్నీ చేసి రకరకాలుగా ఆ రోజుల్లో రాయలసీమకు న్యాయం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు ఆ తర్వాత కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని పెట్టడానికి గత ప్రభుత్వం చంద్రబాబునాయుడు గారి హయాంలో నిర్ణయం తీసుకోవడం, అప్పట్లో ఆ నిర్ణయం కాంట్రవర్సెల్ అని తెలుసు. అప్పట్లో అన్ని రకాలుగా శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి చేసింది అని తెలుసు. అయినప్పటికీ కూడా తాను ఇక్కడ 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని సీఎం జగన్ అన్నారు.
”ఈరోజుకు కూడా నేను చెపుతున్నాను. అలా నిర్ణయం తీసుకోవడం వల్ల… ఈ ప్రాంతమంటే నాకు వ్యతిరేకత లేదు. నా ఇళ్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతమంటే నాకు ప్రేమ కూడా. కానీ ఒక్కటి ఆలోచన చేయాలి. ఈ ప్రాంతం అటు విజయవాడ కాదు ఇటు గుంటూరు కాదు. ఇక్కడ నుంచి గుంటూరు తీసుకుంటే 40 కిలోమీటర్లు, విజయవాడ తీసుకుంటే మరో 40 కిలోమీటర్లు . ఇక్కడ కనీస మౌలికసదుపాయాలు చూస్తే… రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మాత్రమే అయ్యే ఖర్చు… గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఎకరాకు రూ.2 కోట్లు. 50వేల ఎకరాలు అంటే లక్ష కోట్లు రూపాయలు అని లెక్కవేశారు. లక్ష కోట్లు అనేది ఈ రోజు లెక్కలు ప్రకారం. ఒక పదేళ్లు పోతే ఇది కట్టడానికి ఆ లక్ష కోట్లు తేవడానికి, తెచ్చి పెట్టడానికి పదేళ్లు పడుతుందో ఇంకా ఎక్కువ కాలం పడుతుందో తెలియదు కానీ.. ఒక పదేళ్లు పోతే ఇవాళ ఖర్చయ్యే లక్ష కోట్ల విలువ అది ఏ ఆరు లక్షల కోట్లో, ఏడు లక్షల కోట్లో అవుతుంది. అంటే మన దగ్గరున్న డబ్బుతో కనీసం మనం రోడ్లేసుకోవడానికి, డ్రైనేజీ వేసుకోవడానికి, కరెంటు ఇచ్చేదానికి కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో మనం ఉంటే… ఇక్కడ రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యమవుతుందా?” అంటూ జగన్ పేర్కొన్నారు.
Also Read
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
- Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?