రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను సంతృప్తి పరచాలేకానీ… బ్లాక్ మెయిల్ చేయడం తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. తిరుపతిలోని స్థానిక బైరాగి పట్టెడలో ఉన్న సీపీఐ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతం దాల్చుతున్న నేపథ్యంలో ఖమ్మం నందు ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ఉద్యమ విరమణకు ప్రయత్నించగా తెలంగాణ ప్రజలు, ఊస్మానియా వర్శిటీ విద్యార్థులు తిరగబడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో…
ఏపీ సర్కార్ తీరుపై ఈమధ్యకాలంలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. హిందువుల భూములను ఆక్రమించుకుని మసీదులు కట్టాలని ఎస్డీపీఐ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎస్డీపీఐ రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ అహ్మదుల్లా అవాకులు చవాకులు పేలుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల ఓట్ల కోసం కక్కుర్తి పడుతుందన్నారు. ఏపీని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష సీఎంకు లేదు. సంపూర్ణ మద్య నిషేధం అన్న జగన్ మద్యం తాగటానికి మరో గంట పొడిగించాడు. ఈ ప్రభుత్వంలో బ్రాందీలు వాళ్లకు…
కరోనా వైరస్ సోకి మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను వర్తింపచేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే ఈ కారుణ్య నియామకాల వర్తింపు ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి జూన్ 30లోగా ఉద్యోగం కల్పించేందుకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. Read Also: గుడ్…
కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు తీవ్రతరం చేస్తూ.. నైట్ కర్ఫ్యూను విధించారు. మరికొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్‌డౌన్ కూడా విధిస్తున్నారు. అయితే ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి ఈ నెల 31 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…
ఏపీ ఉద్యోగులంతా ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరుపుకున్నారు. సీఎం జగన్ ప్రకటించిన 11వ పీఆర్సీకి ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని, ఉద్యోగులంతా పీఆర్సీ ప్రకటనతో నిరాశ చెందారని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణ మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రకటించిన రివర్స్ పీఆర్సీకీ నిరసనగా రేపు ఢిల్లీలో నిరాహార దీక్ష చేపడుతానన్నారు. రేపు ఉదయం 8గంటల నుంచి…
కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తితో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈనెల 30 వరకు సెలవులు ప్రకటించింది. ఏపీలో మాత్రం విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం సెలవులకు ప్రకటించకుండా.. నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించింది. అలాగే మద్యం దుకాణాలకు ఒక గంట సమయం మినహాయింపు ఇచ్చింది. దీంతో జనసేనాని పవన్ వైసీపీ ప్రభుత్వంకు…
పీఆర్సీపై ఏపీలో ఇంకా స్పష్టత నెలకొనలేదు. ఇటీవలే సీఎం జగన్ పీఆర్సీని ప్రకటించారు. అయితే పీఆర్సీపై ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని, సమ్మెకు వెళ్తామని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఈ సందర్బంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. పీఆర్సీపై కొన్ని ఉద్యోగ సంఘాలు పాజిటివ్‌గా, కొన్ని వ్యతిరేకంగా మాటాడుతున్నాయని ఆయన అన్నారు. ఉద్యోగులు సంతృప్తికరంగా, ఆనందంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎక్కడొ కొన్ని సంఘాలు ఎవరో కొంతమంది వెనుకనుండి ప్రోద్బలం వలన సమ్మెకు వెళ్తామనడం ఆలోచించాల్సిన విషయమన్నారు.…
ఏపీలో ఉద్యోగసంఘాలు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు క్యాంప్ కార్యాలయానికి రానున్నారు. పీఆర్సీ, హెచ్ఆర్ఏ, సీసీఏ రద్దును వ్యతిరేకిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా సహకరించాలని కోరుతోంది ప్రభుత్వం. జీవోలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన బాటలో వెళతాం అంటున్నారు ఉద్యోగ సంఘాలు. సీఎం క్యాంపు కార్యాలయానికి రానున్న సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పీఆర్సీ, హెచ్ఆర్ఏ,…
ఏపీలో పీఆర్సీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. నూతన పీఆర్సీ జీవోలను సోమవారం రాత్రి ప్రభుత్వం విడుదల చేయగా అందులోని పలు అంశాలను ఉద్యోగులను కలవరపరిచాయి. ముఖ్యంగా హెచ్ఆర్ఏను 30 శాతం నుంచి 16 శాతానికి తగ్గించడంతో ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పీఆర్సీ తమకు అక్కర్లేదని… పాత పీఆర్సీనే కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్ర…
కొత్త పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులు చూసి ఉద్యోగులు షాకవుతున్నారు. హెచ్ఆర్ఏలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురుచూసిన ఉద్యోగులకు షాకిస్తూ… ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించింది. సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగుల హెచ్ఆర్ఏను 30 శాతం నుంచి 16 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల్లో 20 శాతం, పురపాలిక సంఘాలు, 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో 14.5 శాతం, మిగతా ప్రాంతాల్లో 12 శాతం ఇస్తున్నారు. కొత్త విధానంలో…